- Home
- Sports
- Cricket
- లెజెండ్స్ లెక్కలు సరి చేస్తున్న రిషబ్ పంత్... టెండూల్కర్, అజార్, కపిల్ దేవ్ రికార్డులు బ్రేక్..
లెజెండ్స్ లెక్కలు సరి చేస్తున్న రిషబ్ పంత్... టెండూల్కర్, అజార్, కపిల్ దేవ్ రికార్డులు బ్రేక్..
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో టెస్టులో భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. విరాట్ కోహ్లీ, పూజారా, విహారి, అయ్యర్ వంటి టాపార్డర్ ఫెయిల్ అయి టీమిండియా 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన స్థితిలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్, రవీంద్ర జడేజాతో కలిసి 222 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన రిషబ్ పంత్, తన సెంచరీతో సచిన్ టెండూల్కర్, అజారుద్దీన్ రికార్డులను బ్రేక్ చేశాడు...

111 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సర్లతో 146 పరుగులు చేసిన రిషబ్ పంత్, 131.54 స్ట్రైయిక్ రేటుతో సెంచరీ మార్కు అందుకున్నాడు. 31 టెస్టుల్లో 48 సిక్సర్లు బాదిన రిషబ్ పంత్, వన్డేల్లో 24, టీ20ల్లో 48 సిక్సర్లు బాది... అంతర్జాతీయ కెరీర్‌లో 100 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు...
24 ఏళ్ల వయసులో 100 అంతర్జాతీయ సిక్సర్లు బాదిన భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా 99 సిక్సర్లు, సచిన్ టెండూల్కర్ 98 సిక్సర్ల రికార్డులను బ్రేక్ చేశాడు...
టెస్టు ఇన్నింగ్స్‌లో 4 అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదడం రిషబ్ పంత్‌కి ఇది ఆరోసారి. వీరేంద్ర సెహ్వాగ్ (ఆరు సార్లు) రికార్డును సమం చేసిన రిషబ్ పంత్, ఎమ్మెస్ ధోనీ (8 సార్లు) తర్వాతి స్థానంలో నిలిచాడు...
ఇద్దరు భారత లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు కలిసి 200+ పైగా భాగస్వామ్యం నెలకొల్పడం ఇది మూడోసారి. ఇంతకుముందు 2007లో పాకిస్తాన్‌పై సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ కలిసి 300 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, రిషబ్ పంత్- రవీంద్ర జడేజా కలిసి ఈ టెస్టులో 222 పరుగులు నెలకొల్పారు. ఇదే జోడి 2019లో సిడ్నీలో టెస్టులో 204 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మూడో స్థానంలో ఉన్నారు..
ఇంగ్లాండ్‌పై ఇంగ్లాండ్‌లో రెండు టెస్టు సెంచరీలు చేసిన మొట్టమొదటి ఆసియా వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు రిషబ్ పంత్... ఇంతకుముందు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి మిగిలిన ఆసియా దేశాల క్రికెటర్లు ఎవ్వరూ టెస్టుల్లో ఈ ఫీట్ సాధించలేకపోయారు.
టెస్టుల్లో 130+ స్ట్రైయిక్ రేటుతో అత్యధిక పరుగులు (146) చేసిన భారత ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రిషబ్ పంత్. ఇంతకుముందు మహ్మద్ అజారుద్దీన్ 109 పరుగులు, కపిల్ దేవ్ 89 పరుగులు చేసి తర్వాతి స్థానంలో నిలిచారు.
సేనా (SENA) దేశాలపై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా నిలిచేందుకు ఒక్క సిక్సర్ దూరంలో నిలిచాడు రిషబ్ పంత్. ఇంతకుముందు ఇంగ్లాండ్‌పై కపిల్ దేవ్ 12 టెస్టు సిక్సర్లు బాదగా, రిషబ్ పంత్ 11 సిక్సర్లతో తర్వాతి స్థానంలో నిలిచాడు..
Rishabh Pant
52 టెస్టు ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక 80+ పరుగులు చేసిన వికెట్ కీపర్ ప్లేయర్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్ (11 సార్లు) రికార్డును సమం చేశాడు రిషబ్ పంత్. SENA దేశాలపై 25 సిక్సర్లు బాదిన మొట్టమొదటి ఆసియా బ్యాటర్‌గా నిలిచాడు రిషబ్ పంత్...
ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ 23, కపిల్ దేవ్ 21, రోహిత్ శర్మ 17, పాక్ బ్యాటర్లు యూనిస్ ఖాన్, మహ్మద్ యూసఫ్, ఎమ్మెస్ ధోనీ 17 సిక్సర్లు బాది... రిషబ్ పంత్ తర్వాతి స్థానాల్లో నిలిచారు..