- Home
- Sports
- Cricket
- రిషబ్ పంత్ ఆడిన ఆట ఏంది, మీరు పెట్టిన హెడ్డింగ్ ఏంది... ఈసీబీపై దినేశ్ కార్తీక్ ఫైర్...
రిషబ్ పంత్ ఆడిన ఆట ఏంది, మీరు పెట్టిన హెడ్డింగ్ ఏంది... ఈసీబీపై దినేశ్ కార్తీక్ ఫైర్...
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో టెస్టులో భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియాని రిషబ్ పంత్, రవీంద్ర జడేజా సెంచరీలతో చెలరేగి ఆదుకున్నారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగుల స్కోరు చేయగలిగింది భారత జట్టు...

51 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన రిషబ్ పంత్, ఆ తర్వాత 89 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్నాడు. సెంచరీ తర్వాత మరింత దూకుడుగా ఆడిన రిషబ్ పంత్, 111 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సర్లతో 146 పరుగులు చేసి జో రూట్ బౌలింగ్‌లో జాక్ క్రావ్లేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
Rishabh Pant
రిషబ్ పంత్ సంచలన ఇన్నింగ్స్ కారణంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 338 పరుగుల స్కోరు చేసింది టీమిండియా. తొలి సెషన్‌లో మినహా ఇస్తే మిగిలిన రెండు సెషన్లలోనూ టీమిండియా ఆధిపత్యమే కొనసాగింది...
అయితే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మాత్రం తొలి రోజు ఆట ముగిసిన తర్వాత ‘డొమినెంట్ పంత్‌ని జో రూట్ అవుట్ చేశాడు...’ అనే హెడ్డింగ్‌తో హైలైట్స్‌ని యూట్యూబ్‌లో పోస్టు చేసింది... ఇలాంటి హెడ్డింగ్ ఇవ్వడంపై భారత సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఫైర్ అయ్యాడు...
‘తొలి రోజు ఇంత చక్కని, భీకరమైన బ్యాటింగ్ తర్వాత కూడా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు హెడ్డింగ్ పెట్టడానికి సరైన టైటిల్ కూడా దొరికినట్టు లేదు. రిషబ్ పంత్ అద్భుతమైన టెస్టు ఇన్నింగ్స్ ఆడాడు. రెండు టీమ్స్ కూడా క్వాలిటీ క్రికెట్ ఆడిన తర్వాత కూడా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకి సరైన టైటిల్ పెట్టడానికి మనసు రానట్టు ఉంది..’ అంటూ ట్వీట్ చేశాడు భారత సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్...
దాదాపు మూడేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన దినేశ్ కార్తీక్, ఐపీఎల్ 2022 పర్పామెన్స్ తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో అదరగొట్టే పర్పామెన్స్ ఇచ్చాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడే జట్టులో దినేశ్ కార్తీక్‌కి చోటు తప్పక ఉంటుందని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు...
Image credit: PTI
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆ తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన రిషబ్ పంత్ కంటే దినేశ్ కార్తీక్‌ని వికెట్ కీపర్‌గా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడేస్తే బెటర్ అంటూ చాలా మంది మాజీ క్రికెటర్లు, క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడ్డారు...
Image credit: PTI
ఐదో టెస్టు జరిగిన తొలి రోజే దినేశ్ కార్తీక్ కెప్టెన్సీలోని భారత జట్టు, డర్బీషైర్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది దినేశ్ కార్తీక్ టీమ్.
111 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సర్లతో 146 పరుగులు చేసిన రిషబ్ పంత్, 131.54 స్ట్రైయిక్ రేటుతో సెంచరీ మార్కు అందుకున్నాడు. 31 టెస్టుల్లో 48 సిక్సర్లు బాదిన రిషబ్ పంత్, వన్డేల్లో 24, టీ20ల్లో 48 సిక్సర్లు బాది... అంతర్జాతీయ కెరీర్‌లో 100 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు...
24 ఏళ్ల వయసులో 100 అంతర్జాతీయ సిక్సర్లు బాదిన భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా 99 సిక్సర్లు, సచిన్ టెండూల్కర్ 98 సిక్సర్ల రికార్డులను బ్రేక్ చేశాడు...