- Home
- Sports
- Cricket
- Harshit Rana : 6 4 6 4 0 6 చెత్త రికార్డ్, 1 1 W 0 0 W బెస్ట్ రికార్డ్ : ఆరంగేట్ర వన్డేలో అద్భుత అనుభవం
Harshit Rana : 6 4 6 4 0 6 చెత్త రికార్డ్, 1 1 W 0 0 W బెస్ట్ రికార్డ్ : ఆరంగేట్ర వన్డేలో అద్భుత అనుభవం
India vs England : ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా యువ బౌలర్ ఓ వింత అనుభవం ఎదురయ్యింది. ఈ మ్యాచ్ లో అతడు ఓ చెత్త రికార్డ్. ఓ మంచి రికార్డ్ సాధించాడు. ఆ ఆటగాడు ఎవరు, ఏమిటా రికార్డులు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
INDIA Vs England First ODI
INDIA Vs England First ODI : ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఇప్పటికే టీ20 సీరిస్ ముగియగా ఇప్పుడు వన్డే సీరిస్ ప్రారంభమయ్యింది. నాగ్ పూర్ వేదికగా ఇవాళ మొదటి వన్డే జరుగుతోంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోయింది. దీంతో 248 పరుగులకే ఇంగ్లాండ్ పరిమితం అయ్యింది.
ఇంగ్లాండ్ కు ఓపెనర్లు మంచి ఆరంభమే అందించారు. 71 పరుగుల వరకు ఇంగ్లీష్ టీం ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు... ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, డుకెట్ శుభారంభం అందించారు. సాల్ట్ అయితే దూకుడుగా ఆడి కేవలం 26 బంతుల్లోనే 3 సిక్సులు, 5 ఫోర్ల సాయంతో 43 పరుగులు చేసాడు. మరో ఓపెనర్ డుకెట్ కూడా 29 బంతుల్లో 32 పరుగులు చేసాడు.
8 ఓవర్ల వరకు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ బాగానే సాగింది. ఇలాగే కొనసాగితే ఆ టీం 300 పైగా స్కోరు సాధించేది. కానీ భారత బౌలర్లు అలా జరగనివ్వలేదు... ముఖ్యంగా ఆరంగేట్ర బౌలర్ హర్షిత్ రాణా బంతితో మ్యాజిక్ చేసి ఓకే ఓవర్ తో మ్యాచ్ ను మలుపుతిప్పాడు. అతడి దాటికి 71-0 గా వున్న ఇంగ్లాండ్ స్కోర్ బోర్డ్ 77-3 గా మారింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ వికెట్ల పతనం కొనసాగడంతో భారీ స్కోరు సాధిస్తుందనుకున్న టీం 248 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
Harshit Rana
ఆరంగేట్ర మ్యాచ్ లో హర్షిత్ కు వింత అనుభవం :
భారత యువ బౌలర్ హర్షిత్ రాణా ఇప్పటికే అంతర్జాతీయ టెస్ట్, టీ20 ఫార్మాట్ లో ఆరంగేట్రం చేసారు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ తో వన్డే లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లాండ్ పై తొలి వన్డే ఆడే అవకాశం అతడికి దక్కింది.
ఈ మ్యాచ్ లో సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో కలిసి కొత్తబంతిని అందుకున్నాడు. ఇలా మ్యాచ్ ఆరంభంలోనే బౌలింగ్ చేసే అవకాశం యువబౌలర్ హర్షిత్ కు దక్కింది. అతడు కూడా నమ్మకాన్ని వమ్ముచేయకుండా తొలి రెండు ఓవర్లు బాగానే బౌలింగ్ చేసాడు. ఫస్ట్ ఓవర్లో 11 పరుగులు ఇచ్చినా రెండవ ఓవర్ మెయిడిన్ వేసి సమం చేసాడు.
అయితే హర్షిత్ వేసిన మూడో ఓవర్ ఓ పీడకలలా మారింది. ఇంగ్లాండ్ ఓపెనర్ సాల్ట్ ఈ ఓవర్లో విరుచుకుపడ్డాడు. ఏకంగా 3 సిక్సర్లు, రెండు ఫోర్లు బాది హర్షిత్ కు చుక్కలు చూపించాడు. ఇలా ఒకే ఓవర్లో 26 పరుగులు సమర్పించుకున్నాడు ఈ యువ బౌలర్. ఆరంగేట్ర మ్యాచ్ లో ఇలా ఓకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన ఆటగాడిగా చెత్త రికార్డ్ ను మూటగట్టుకున్నాడు.
అయితే ఇలా ఒకే ఓవర్లో నాలుగైదు ఓవర్లకు సరిపడా పరుగులు ఇచ్చినా హర్షిత్ ఏమాత్రం భయపడిపోలేదు. తర్వాతి ఓవర్లోనే అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చాడు. అప్పటికే సాల్ట్ రనౌట్ కాగా మరో ఓపెనర్ డుకెట్ అద్భుతంగా ఆడుతున్నాడు. అతడిని ఓ అద్బుతమైన బంతితో బోల్తా కొట్టించాడు హర్షిత్. జైస్వాల్ చక్కటి క్యాచ్ అందుకోవడంతో డుకెట్ ఔటయ్యాడు. ఆ తర్వాత మరో చక్కటి బంతితో హ్యారీ బ్రూక్ ను కూడా ఔట్ చేసాడు. ఇలా ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్ ను ఇండియావైపు మలుపుతిప్పాడు హర్షిత్ రాణా.
ఇలా ఆరంగేట్ర మ్యాచ్ లోనే రెండు రకాల అనుభవాలు ఎదుర్కొన్నాడు హర్షిత్. తన బౌలింగ్ లో చితకబాదుతున్నారని నిరాశ చెందివుంటే అతడు కమ్ బ్యాక్ ఇచ్చేవాడు కాదు. కానీ చెత్త రికార్డు సాధించిన మ్యాచ్ లోనే తన కెరీర్ లో బెస్ట్ రికార్డ్ కూడా సాధించాడు హర్షిత్. అతడి కమ్ బ్యాక్ ఇండియన్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది... ఇది కదా ఓ ఆటగాడికి కావాల్సింది... అంటూ ఈ యువ కెరటాన్ని కొనియాడుతున్నారు.
INDIA Vs England 1st ODI
మొత్తంగా భారత బౌలింగ్ ఎలా సాగిందంటే :
ఓ దశలో ఇంగ్లాండ్ వికెట్లేవి కోల్పోకుండా 7 ఓవర్లకే 70 పరుగులు చేసింది... ఓపెనర్లు మంచి టచ్ లో కనిపించారు. సాల్ట్ అయితే దూకుడుగా ఆడాడు. దీంతో భారత్ ముందు భారీ లక్ష్యం వుంటుందని అందరూ భావించారు. కానీ హర్షిత్ రాణా ఒకే ఒవర్ మ్యాచ్ స్వరూపాన్ని మలుపుతిప్పింది.
పాండ్యా బౌలింగ్ లో సాల్ట్ రనౌట్, ఆ తర్వాత హర్షిత్ వేసిన ఓవర్లో డుకెట్, బ్రూక్ వికెట్లు పడటంతో ఇంగ్లాండ్ కు కష్టాలు మొదలయ్యాయి. షమీ, రవీంద్ర జడేజా కూడా అద్భుతంగా బౌలింగ్ చేసారు. ఇలా ఆరంగేట్ర మ్యాచ్ లో హర్షిత్ 3 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా 3, కుల్దీప్ 1, షమీ 1 అక్షర్ 1 వికెట్ పడగొట్టారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 248 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత్ 249 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగింది.
ఇంగ్లాండ్ కెప్టెన్ మిడిల్ ఓవర్లలో అద్భుతంగా బ్యాటింగ్ చేసాడు. అతడు 52 పరుగులతో రాణించాడు. కెప్టెన్ కు జాకబ్ బెథెల్ 51 పరుగులతో సహకారం అందిచాడు. ఆరంభంలో సాల్ట్ 43 పరుగులు, చివర్లో ఆర్చర్ 21 పరుగులతో మెరిసారు. దీంతో ఇంగ్లాండ్ 248 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచగలిగింది.