- Home
- Sports
- Cricket
- పరుగుల సంగతి సరే! రోహిత్ కెప్టెన్సీలో ఆ దూకుడు ఉంటుందా... కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ యాటిట్యూడ్‌ని...
పరుగుల సంగతి సరే! రోహిత్ కెప్టెన్సీలో ఆ దూకుడు ఉంటుందా... కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ యాటిట్యూడ్‌ని...
లేటు వయసులో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు రోహిత్ శర్మ... టెస్టు సారథిగా రోహిత్ శర్మకు అసలు సిసలైన ఛాలెంజ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతోనే ప్రారంభం కానుంది. ఎందుకుంటే టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ టీమ్‌పై వేసిన ట్రేడ్ మార్క్ వేరు. ఇప్పుడు దాన్ని రిపీట్ చేయాల్సిన బాధ్యత రోహిత్ శర్మపైన పడింది...

ఆస్ట్రేలియా, రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని ఆధిపత్యం చూపించింది. టెస్టు, వన్డేల్లో ఘన విజయాలు అందుకుంటూ... ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే ఓడిపోవడం ఖాయమని మిగిలిన జట్లు అనుకునేంతలా డామినేట్ చేసింది...
ఆస్ట్రేలియా ఇంతటి డామినేషన్ చూపించడానికి వారి ఆటతీరు కూడా ఓ కారణం. సెడ్జింగ్ చేస్తూ, ప్రత్యర్థి ఆటగాళ్లపై మానసికంగా పైచేయి సాధించి, ఆ తర్వాత ఆటలో దెబ్బతీయడం ఆస్ట్రేలియా స్పెషాలిటీ. అలాంటి ఆసీస్‌కి సెడ్జ్ చేయాలంటేనే భయపడేలా చేశాడు విరాట్ కోహ్లీ..
2017 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో, 2018 ఆస్ట్రేలియా టూర్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా, ఆసీస్‌పై చూపించిన డామినేషన్ వేరే లెవెల్. వారి స్టైల్‌లోనే సెడ్జింగ్ చేస్తూ, రెచ్చగొడుతూ భారత జట్టుకి వరుస విజయాలు అందించాడు విరాట్ కోహ్లీ. కొన్నిసార్లు ఈ దూకుడు టీమిండియాకి తేడా కొట్టినా, మెజారిటీ సార్లు విజయాలనే అందించింది...
లార్డ్స్ టెస్టులో జేమ్స్ అండర్సన్‌ని టార్గెట్ చేస్తూ బౌన్సర్లు వేశాడు జస్ప్రిత్ బుమ్రా. 150 టెస్టులు ఆడిన అనుభవం ఉన్న జేమ్స్ అండర్సన్, బుమ్రా వేసే బౌన్సర్లను ఫేస్ చేయలేక భయపడిపోయాడు. ఆ ఇన్నింగ్స్ అనంతరం బుమ్రాని టార్గెట్ చేస్తూ ఇంగ్లాండ్ బౌలర్లు బౌన్సర్లు వేశారు. ఇదే ఇంగ్లాండ్‌ని తీవ్రంగా దెబ్బతీసింది.
ఆఖరి రోజు కేవలం 45 ఓవర్లు మాత్రమే మిగిలిన టైమ్‌లో, ఇంగ్లాండ్‌ని వారి ఫెవరెట్ గ్రౌండ్‌లో ఆలౌట్ చేశారు భారత బౌలర్లు. నిప్పులు చెదిరే బౌలింగ్‌తో గాయపడిన చిరుతల్లా, ప్రత్యర్థి బ్యాటర్లపై విరుచుకుపడింది టీమిండియా. చారిత్రక విజయం అందుకుంది. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా టీమ్‌పై వేసిన ముద్రకి ఈ ఒక్క మ్యాచ్ చూస్తే చాలు...
ఇప్పుడు ఆస్ట్రేలియా టీమ్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవగలమని ధీమా వ్యక్తం చేయడానికి విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా లేకపోవడం కూడా ఓ కారణం. దూకుడైన కెప్టెన్ విరాట్‌కి తోడుగా మరో ఫైర్ గన్ రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా ఉండేవాడు. ఇప్పుడు మిస్టర్ కూల్ రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా ఉన్నాడు...
Rohit Sharma
రోహిత్ శర్మ, ఆస్ట్రేలియాని ఓడించి టెస్టు సిరీస్ గెలిస్తే... కెప్టెన్‌గా చాలామందికి సమాధానం చెప్పినట్టే. అయితే స్వదేశంలో కాబట్టి పరిస్థితులను వాడుకుని వచ్చే అల్లాటప్పా విజయాలు కాదు, కావాల్సింది... ఆస్ట్రేలియాని డామినేట్ చేస్తూ అదిరిపోయే విజయాలు... మరి కెప్టెన్ రోహిత్ ఏం చేస్తాడో చూడాలి..