- Home
- Sports
- Cricket
- రాహుల్ నిజం చెప్పు! నీ దగ్గర వాళ్ల వీడియోలు ఉన్నాయా.. బీసీసీఐని బ్లాక్ మెయిల్ చేస్తున్నావా...
రాహుల్ నిజం చెప్పు! నీ దగ్గర వాళ్ల వీడియోలు ఉన్నాయా.. బీసీసీఐని బ్లాక్ మెయిల్ చేస్తున్నావా...
కెఎల్ రాహుల్.. టెస్టుల్లో టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్. ఏ మాత్రం కెప్టెన్సీ స్కిల్స్ లేవని విమర్శలు ఎదుర్కొన్న రాహుల్, బీసీసీఐ పెద్దలకు మాత్రం ఆశాకిరణంలా కనిస్తున్నాడు. శుబ్‌మన్ గిల్ లాంటి ఫామ్‌లో ఉన్న ప్లేయర్లను కూడా పట్టించుకోని సెలక్టర్లు, రాహుల్‌కి వరుస అవకాశాలు ఇస్తున్నారు...

2022 జనవరి నుంచి టెస్టుల్లో ఒక్క ఇన్నింగ్స్‌లో కూడా 25+ స్కోరు నమోదు చేయలేకపోయాడు కెఎల్ రాహుల్... మరోవైపు శుబ్‌మన్ గిల్, వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదుతూ బీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. అయినా అతన్ని పక్కనబెట్టి మొదటి రెండు టెస్టుల్లో రాహుల్‌కి అవకాశం ఇచ్చింది టీమిండియా...
Image credit: PTI
ప్రస్తుతం టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా ఉన్న కెఎల్ రాహుల్, టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ రేసులో ఉన్నాడు. రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడం, జస్ప్రిత్ బుమ్రా వెన్ను గాయంతో సతమతమవుతుండడంతో టీమిండియాకి మరో ఆప్షన్ కూడా లేదు...
Image credit: Getty
శ్రేయాస్ అయ్యర్‌కి ముంబై టీమ్ కెప్టెన్‌గా అనుభవం ఉన్నా, అతనికి బీసీసీఐ నుంచి పెద్దగా సపోర్ట్ దక్కడం లేదు... కెఎల్ రాహుల్ మాదిరిగా శ్రేయాస్ అయ్యర్ వెనక ఓ బాలీవుడ్ బడా హీరో మామ లేడు...
KL Rahul
కుల్దీప్ యాదవ్, బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో 8 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన తర్వాత కూడా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. మరోవైపు కెఎల్ రాహుల్ వరుసగా విఫలమవుతున్నా, రిజర్వు బెంచ్‌లో కూర్చోవడం లేదు...
ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, రెండో ఇన్నింగ్స్‌లో 1 పరుగుకే నాథన్ లియాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. వరుసగా ఫెయిల్ అవుతున్నా రాహుల్‌ని తప్పించడం లేదంటే బీసీసీఐ బోర్డు పెద్దల సీక్రెట్ వీడియోలు, అతన్ని దగ్గర ఉన్నాయా? వాటిని చూపించి రాహుల్, సెలక్టర్లను బెదిరిస్తున్నాడా? అంటూ ఫన్నీ మీమ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
K L Rahul
కెఎల్ రాహుల్ ట్రోలింగ్ ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. మూడేళ్లుగా కెఎల్ రాహుల్‌పై ఇలాంటి ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. అయితే కెఎల్ రాహుల్ కూడా వరుసగా విఫలమవుతూనే ఉన్నాడు.
Mayank Agarwal
శిఖర్ ధావన్‌కి టెస్టుల్లో 40+ యావరేజ్ ఉన్నా, మయాంక్ అగర్వాల్ రెండు డబుల్ సెంచరీలతో 41+ యావరేజ్‌తో పరుగులు చేసినా పట్టించుకోని సెలక్టర్లు, కెఎల్ రాహుల్‌ని మాత్రం నెత్తి మీద పెట్టుకుని వైస్ కెప్టెన్సీ కట్టబెట్టడం వెనక నిజంగానే బడాబాబుల హస్తం ఉందనేది ఎవ్వరూ కాదనలేని విషయం... మయాంక్ అగర్వాల్, న్యూజిలాండ్‌పై టెస్టులో 160 పరుగులు చేసిన తర్వాత కూడా అతను టీమ్‌లో చోటు కోల్పోవాల్సి వచ్చింది..
ఓ వైపు సర్ఫరాజ్ ఖాన్, రంజీల్లో బ్రాడ్‌మెన్ రికార్డులను చెరిపేస్తున్నా... సెలక్టర్లు అస్సలు పట్టించుకోవడం లేదు. త్రిబుల్ సెంచరీ చేసిన కరణ్ నాయర్‌ని, మూడంటే మూడు టెస్టులకు పక్కన బెట్టేశారు. ఆడిలైడ్ టెస్టులో ఫెయిల్ అయ్యాక పృథ్వీ షాని పట్టించుకోవడం మానేశారు. మరీ కెఎల్ రాహుల్‌లో ఏం చూసి, ఇన్ని అవకాశాలు ఇస్తున్నారు? అనేది టీమిండియా అభిమానులకు అంతుచిక్కని విషయంగా మారింది..