- Home
- Sports
- Cricket
- ఇండోర్‌లో టీమిండియా చెత్త రికార్డు... కపిల్ దేవ్ రికార్డును అందుకున్న రవీంద్ర జడేజా...
ఇండోర్‌లో టీమిండియా చెత్త రికార్డు... కపిల్ దేవ్ రికార్డును అందుకున్న రవీంద్ర జడేజా...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో మొదటి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియాపై తిరుగులేని ఆధిపత్యం చూపించింది భారత జట్టు. మిగిలిన రెండు టెస్టుల్లో కూడా గెలిచి సిరీస్‌ని 4-0 తేడాతో సమం చేయాలని అనుకుంది. అయితే ఇండోర్‌లో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వ్యూహాం బెడిసికొట్టిందా?

Image credit: PTI
వాస్తవానికి ఇండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ధర్మశాల వేదికగా జరగాల్సింది. అయితే శీతాకాలం కురిసిన మంచు కారణంగా ధర్మశాలలో అవుట్ ఫీల్డ్ పాడైపోవడంతో అక్కడి నుంచి ఇండోర్‌కి మారింది మూడో టెస్టు...
Image credit: PTI
టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగానే తొలి రెండు టెస్టుల మాదిరిగా కాకుండా మూడో టెస్టు నాలుగైదు రోజులు జరుగుతుందని ఆశించారు అభిమానులు. అయితే భారత జట్టు 33.2 ఓవర్లలోనే 109 పరుగులకి ఆలౌట్ అయ్యింది..
Image credit: Getty
టీమిండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లీ మినహా మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ 50 బంతులు కూడా ఫేస్ చేయలేకపోయారు. ఇండియాలో ఆస్ట్రేలియాపై అతి తక్కువ బంతుల్లో ఆలౌట్ కావడం ఇదే తొలిసారి. ఇంతకుముందు 2017లో పూణేలో మ్యాచ్‌లో భారతజట్టు తొలి ఇన్నింగ్స్‌లో 40.1 ఓవర్లు, రెండో ఇన్నింగ్స్‌లో 33.5 ఓవర్లు ఆడి ఆలౌట్ అయ్యింది. ఆ రికార్డును చెరిపేసింది రోహిత్ సేన...
Axar Patel
ఇండియాలో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో టీమిండియాకి ఇది నాలుగో అత్యల్ప స్కోరు. ఇంతకుముందు 2004లో ముంబైలో 104 పరుగులకి ఆలౌట్ అయిన భారత జట్టు, 2017 పూణే టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 105 పరుగులకి, తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగులకి ఆలౌట్ అయ్యింది..
Image credit: Getty
ట్రావిస్ హెడ్ వికెట్ తీసిన రవీంద్ర జడేజా, అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. బ్యాటుతో 5 వేల పరుగులు, బంతితో 500 వికెట్లు తీసిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు రవీంద్ర జడేజా. ఇంతకుముందు కపిల్ దేవ్ ఒక్కడే ఈ ఫీట్ సాధించాడు...
Image credit: PTI
ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించిన 11వ ప్లేయర్ జడేజా. ఇంతకుముందు కపిల్ దేవ్‌తో పాటు ఇమ్రాన్ ఖాన్, ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్, షాన్ పోలాక్, చమిందా వాస్, డానియల్ విటోరి, జాక్వస్ కలీస్, షాహిద్ ఆఫ్రిదీ, షకీబ్ అల్ హసన్ ఈ ఫీట్ సాధించారు.
ట్రావిస్ హెడ్‌ని అవుట్ చేసిన తర్వాతి ఓవర్‌లోనే మార్నస్ లబుషేన్‌కి క్లీన్ బౌల్డ్ చేశాడు రవీంద్ర జడేజా. అయితే అది నో బాల్‌గా తేలడంతో లబుషేన్‌కి లైఫ్ వచ్చింది. ఆ తర్వాత ఉస్మాన్ ఖవాజా కోసం రెండు సార్లు రివ్యూలు తీసుకున్న జడేజా, టీమిండియా రెండు రివ్యూలను వృథా చేశాడు..