వాళ్లను ఎలా ఓడించాలో మాకు బాగా తెలుసు! ఇండియాలో అయితే... - న్యూజిలాండ్ క్రికెటర్ మిచెల్ సాంట్నర్
ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచి, టేబుల్ టాపర్‌గా నిలిచింది న్యూజిలాండ్. రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియంసన్ గాయంతో ఒకే ఒక్క మ్యాచ్ ఆడినా.. మిగిలిన టీమ్ అద్భుతంగా ఆడుతూ అదరగొడుతోంది..
క్వింటన్ డి కాక్ మొదటి రెండు మ్యాచుల్లో సెంచరీలు చేయగా డివాన్ కాన్వే, టామ్ లాథమ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, విల్ యంగ్ అందరూ చక్కగా రాణిస్తున్నారు...
New Zealand vs Afghanistan
న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ 11 వికెట్లు, ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ 9 వికెట్లతో వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా టాప్ 2లో ఉన్నారు. లూకీ ఫర్గూసన్ 6, ట్రెంట్ బౌల్ట్ 5 వికెట్లతో అదరగొట్టారు..
టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌ని అక్టోబర్ 22న ధర్మశాలలో ఆతిథ్య టీమిండియాతో ఆడుతోంది. టీమిండియా, బంగ్లాదేశ్‌తో మ్యాచ్ గెలిస్తే, న్యూజిలాండ్ మ్యాచ్ సమయానికి ఇరు జట్లు అజేయంగా ఉంటాయి..
‘ఇండియాలో ఇండియాని ఎదుర్కోవడం ఛాలెంజింగ్‌గా ఉంటుంది. సొంత పిచ్ మీద వాళ్లు చాలా స్ట్రాంగ్ టీమ్. అయితే ధర్మశాలలో గెలవడానికి ఏం చేయాలో మాకు తెలుసు. ఇక్కడ కాస్త పేస్, బౌన్స్ బాగా వర్కవుట్ అవుతోంది..
New Zealand vs Afghanistan
భారత జట్టుతో ఆడేటప్పుడు ఏం చేయాలో అప్పుడు చూసుకుంటాం. పవర్ ప్లేలో రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతూ, ప్రత్యర్థి బౌలర్లను ప్రెషర్‌లో పడేస్తున్నాడు. మా టీమ్‌లో కూడా అలాంటి బ్యాటర్లే ఉన్నారు..
భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో భిన్నమైన పిచ్ పరిస్థితుల్లో నాలుగు మ్యాచులు గెలిచాం. ఇండియాతో మ్యాచ్‌లో ఎలా ఆడాలో మాకు క్లారిటీ ఉంది. టాప్‌లో ఉన్నాం.
New Zealand
ఒక్క మ్యాచ్ ఓడిపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే 2 పాయింట్లను తేలిగ్గా వదులుకోవడానికి మేం సిద్ధంగా లేం..’ అంటూ కామెంట్ చేశాడు న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్..
2003 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌పై ఒక్క విజయం కూడా అందుకోలేకపోయింది భారత జట్టు. 2019 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై సెమీస్‌లో ఓడిన టీమిండియా, 2021 టీ20 వరల్డ్ కప్, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2021లోనూ న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది..