10 సెకన్లకు రూ.16 లక్షలు: భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ మాత్రం ఉంటది మరి !
India Pakistan Asia Cup 2025: ఆసియా కప్ 2025లో భారత్–పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ డిమాండ్‌తో ప్రకటన రేట్లు రికార్డు స్థాయికి చేరాయి. కేవలం 10 సెకన్ల కోసం రూ.16 లక్షలు తీసుకుంటున్నారు.

ఆసియా కప్ 2025: భారత్-పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్
సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ హై వోల్టేజీ పోరుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఆసియా కప్ 2025లో జరగనుంది.
టోర్నమెంట్ లో మొత్తం 19 మ్యాచ్‌లు ఉండగా, టీ20 ఫార్మాట్‌లో ఈ పోటీలు జరుగుతాయి. భారత్ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో ఆడనుంది. సెప్టెంబర్ 19న ఒమన్‌తో భారత్ గ్రూప్ మ్యాచ్ ఆడుతుంది
KNOW
భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. యాడ్ ధరల్లో భారీ పెరుగుదల
ఆసియా కప్ లో భారత్ మ్యాచ్‌లలో 10 సెకన్ల టీవీ ప్రకటన ధర రూ.14–16 లక్షల మధ్య ఉండనుందని పలు మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా భారత్-పాక్ పోరులో 10 సెకన్ల ప్రకటన ధర రూ.16 లక్షలు. అన్ని భారత్, నాన్-ఇండియా గేమ్స్ కలిపిన స్పాట్-బై ప్యాకేజీ రూ.4.48 కోట్లుగా ఉండనున్నాయి.
ఆసియా కప్ 2025 : సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ యాడ్ ఆఫర్లు
ఆసియా కప్ 2025 ప్రసార హక్కులు సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా కలిగి ఉంది. పలు మీడియా రిపోర్టుల ప్రకారం..
కో-ప్రెజెంటింగ్ స్పాన్సర్‌షిప్: రూ.18 కోట్లు
అసోసియేట్ స్పాన్సర్‌షిప్: రూ.13 కోట్లు
డిజిటల్ కో-ప్రెజెంటింగ్, హైలైట్స్ పార్టనర్: రూ.30 కోట్లు
డిజిటల్ కో-పవర్డ్ బై ప్యాకేజీ: రూ.18 కోట్లు
డిజిటల్ ప్రకటనల్లో 30 శాతం భారత్ మ్యాచ్‌లకు కేటాయించారు.
డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ప్రకటనల ధరలు
సోనీ లివ్‌లో ప్రీరోల్స్ ధరలు 10 సెకన్లకు రూ.275 కాగా, భారత్ మ్యాచ్‌లకు రూ.500, భారత్-పాక్ పోరుకు రూ.750. మిడ్-రోల్స్ ధరలు 10 సెకన్లకు రూ.225, భారత్ మ్యాచ్‌లకు రూ.400, భారత్-పాక్ మ్యాచ్‌లకు రూ.600. కనెక్టెడ్ టీవీ ప్రకటనలు రూ.450 కాగా, భారత్ మ్యాచ్‌లకు రూ.800, భారత్-పాక్ మ్యాచ్‌లకు రూ.1,200 గా ఉంది.
ఆసియా కప్ 2025: ఒకే గ్రూప్ లో భారత్ పాకిస్తాన్ జట్లు
ఆసియా కప్ 2025లో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ Aలో భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ జట్లు ఉన్నాయి. గ్రూప్ Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ ఉన్నాయి.
గ్రూప్ దశలో టాప్ 2 జట్లు సూపర్ ఫోర్ కు అర్హత సాధిస్తాయి. సెప్టెంబర్ 22న అబుదాబిలో ఒక సూపర్ ఫోర్స్ మ్యాచ్ జరగనుండగా, మిగిలిన పోటీలు, ఫైనల్ దుబాయ్‌లో జరుగుతాయి.
ఆసియా కప్ 2025 కోసం పాకిస్తాన్ జట్టు ఇదే
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్ జట్టులో లేరు. సల్మాన్ అలీ అఘాను కెప్టెన్‌గా నియమించారు. జట్టులో షాహీన్ అఫ్రిదీ, ఫఖర్ జమాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ వంటి ఆటగాళ్లు ఉన్నారు. కాగా, ఆసియా కప్ 2025 కోసం భారత్ జట్టును ఆగస్టు 19న ప్రకటించే అవకాశం ఉంది.