ఈసారి వరల్డ్ కప్ గెలిచేదివారే? గత మూడు టోర్నీల్లో అతను చెప్పినట్టే జరిగింది, ఈసారి కూడా...
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ మరికొన్ని గంటల్లో మొదలు కానుంది. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌లో ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. 10 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో 47 మ్యాచులు జరుగుతాయి..
ఈసారి ఆస్ట్రేలియా గెలుస్తుందని కొందరు, కానీ ఇంగ్లాండ్ గెలుస్తుందని ఇంకొందరు క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. వరల్డ్ కప్ గెలిచే అర్హతలన్నీ తమకే ఉన్నాయని పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ఫ్యాన్స్ అంటుంటే, స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ కావడంతో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఇండియాదేనని చాలామంది అంచనా వేస్తున్నారు..
ప్రముఖ జ్యోతిషుడు గ్రీన్‌స్టోన్ లోబో, వన్డే వరల్డ కప్ 2023 విజేత గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2011 నుంచి వన్డే వరల్డ్ కప్ టోర్నీని ఇండియా గెలుస్తుందని చెప్పిన గ్రీన్‌స్టోన్ లోబో, 2015లో ఆస్ట్రేలియానే టైటిల్ సాధిస్తుందని చెప్పాడు. 2019 వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్, వరల్డ్ కప్ విజేతగా నిలుస్తుందని అంచనా వేశాడు గ్రీన్‌స్టోన్ లోబో..
Rohit Sharma-Greenstone Lobo
తాజాగా తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈసారి వన్డే వరల్డ్ కప్ గెలిచే టీమ్ గురించి వెల్లడించాడు గ్రీన్‌స్టోన్ లోబో. ‘ఇంతకుముందు 1986లో పుట్టిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, వరల్డ్ కప్ గెలిచాడు. ఈసారి 1987లో పుట్టిన కెప్టెన్, ప్రపంచ కప్ గెలవబోతున్నాడు. ఈసారి 1987లో పుట్టిన కెప్టెన్ భారత సారథి రోహిత్ శర్మ మాత్రమే.. అయితే భారత్‌కి అంత ఈజీగా టైటిల్ రాదు. మిగిలిన జట్లన్నీ మంచి పోటీ ఇస్తాయి.. ’ అంటూ వ్యాఖ్యానించాడు గ్రీన్‌స్టోన లోబో..
‘ఆస్ట్రేలియాకి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే కమ్మిన్స్ 1993లో పుట్టాడు. కమ్మిన్స్ టీమ్‌లో 2-3 ప్లేయర్లు, వరల్డ్ కప్ గెలిచారు. అయితే ప్రపంచ కప్ గెలిచేందుకు కావాల్సిన వైబ్రేషన్స్, ఆస్ట్రేలియా జట్టులో కనిపించడం లేదు..
ఆసీస్‌తో పోలిస్తే ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌కి మంచి సమయం నడుస్తోంది. అతను గొప్ప కెప్టన్లలో ఒకడు. అయితే అతను 1986, 1987, తర్వాత వచ్చే 1990 బ్యాచ్‌కి చెందినవాడు. ఇంగ్లాండ్ కోచ్ మాథ్యూ మాట్‌కి కూడా జాతకం బాగుంది. ఇంగ్లాండ్‌తో మిగిలిన అన్ని జట్లూ జాగ్రత్తగా ఉండాల్సిందే..
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, 1992లో పుట్టాడు. అతని జాతకం కూడా ఈసారి వరల్డ్ కప్‌కి అనుకూలంగా లేదు.
పాకిస్తాన్ కోచ్ గ్రాండ్ బ్రాడ్‌బర్ట్ జాతక చక్రం కూడా బాగుంది. అతను 1966లో పుట్టాడు. పాకిస్తాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో అంచనా వేయడం కష్టం. అయితే బాబర్ ఆజమ్ పుట్టింది 1994లో కాబట్టి, పాక్‌కి ప్రపంచ కప్ గెలిచే అవకాశం కనిపించడం లేదు.
సౌతాఫ్రికా చాలా మంచి టీమ్. తెంబ భవుమా 1990లో పుట్టాడు. అతని టీమ్‌లో చాలా మంచి ప్లేయర్లు ఉన్నారు. అయితే రోబ్ వాల్టర్‌కి సమయం బాగోలేదు. అయితే సౌతాఫ్రికాని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు..
సౌతాఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లాండ్ పోటీ ఇస్తున్నా ఈసారి వరల్డ్ కప్ గెలిచేందుకు కావాల్సిన అర్హతలన్నీ ఇండియాకే ఉన్నాయి. ముంబై ఇండియన్స్ సారథిగా రోహిత్ శర్మ 5 టైటిల్స్ గెలిచాడు. ఆసియా కప్ కూడా గెలిచాడు.
Rohit Sharma Rain
రోహిత్ శర్మ జాతకం, లియోనెల్ మెస్సీ జాతకానికి దగ్గరగ ఉంటుంది. అతను కూడా 1987లోనే పుట్టాడు. ఈసారి మెస్సీ, కోపా అమెరికా గెలిచి, వరల్డ్ కప్ గెలిచినట్టే... రోహిత్ కూడా ఆసియా కప్‌తో పాటు వరల్డ్ కప్ గెలుస్తాడు..’ అంటూ కామెంట్ చేశాడు గ్రీన్‌స్టోన్ లోబో..