ఆస్ట్రేలియాను చిత్తుచేసిన భారత్.. వాషింగ్టన్ దెబ్బ అదుర్స్
IND vs AUS : క్వీన్స్‌ల్యాండ్‌లో ఆస్ట్రేలియా తో జరిగిన 4వ టీ20 మ్యాచ్ లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. మొదట బ్యటింగ్ లో తడబడినా అద్భుతమైన బౌలింగ్ తో మ్యాచ్ ను గెలుచుకుంది భారత్. దీంతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్ లో 2-1తో ఆధిక్యం సాధించింది.

5 మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యం
ఐదు మ్యాచ్ లో టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన నాల్గో మ్యాచ్ లో భారత్ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. అద్భుతమైన బౌలింగ్ తో ఆసీస్ కు షాక్ ఇచ్చింది. క్వీన్స్‌ల్యాండ్‌లో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఆస్ట్రేలియా ముందు 168 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే, 119 పరుగులకే కంగారు టీమ్ ఆలౌట్ అయింది. దీంతో భారత్ 48 పరుగుల తేడాతో గెలిచింది.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన భారత్ కు గొప్ప ఆరంభం లభించింది. అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్‌ల ఓపెనింగ్ జోడి 6.4 ఓవర్లలో 56 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అభిషేక్ 21 బంతుల్లో 28 పరుగులు చేసి పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. అతని ఇన్నింగ్స్‌లో ఒక సిక్స్, మూడు ఫోర్లు ఉన్నాయి.
గిల్ హాఫ్ సెంచరీ మిస్
అభిషేక్అ వుక్కడి నుంచి శివం దుబే, శుభ్‌మన్ గిల్‌తో కలిసి రెండో వికెట్‌కు 32 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును బలోపేతం చేయడానికి ప్రయత్నించాడు. దుబే 18 బంతుల్లో 22 పరుగులు చేసి పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గిల్‌తో కలిసి మూడో వికెట్‌కు 33 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితిలో ఉంచాడు. గిల్ 39 బంతుల్లో 1 సిక్స్, 4 ఫోర్లతో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత సూర్య 10 బంతుల్లో 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో భారత్ స్కోర్ బోర్డ్ నెమ్మదించింది.
అక్షర్ పటేల్ సూపర్ షో
అక్షర్ పటేల్ చివరి ఓవర్లలో 11 బంతుల్లో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. బ్యాటింగ్ లో ఎంతో విలువైన పరుగులు చేసిన అక్షర్ బౌలింగ్ లో కూడా అదరగొట్టాడు. 2 వికెట్లు పడగొట్టి భారత్ కు విజయాన్ని అందించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా తలా మూడు వికెట్లు పడగొట్టారు. జేవియర్ బార్ట్‌లెట్, మార్కస్ స్టోయినిస్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
మంచి ఆరంభం వచ్చినా.. వరుస వికెట్లు కోల్పోయిన ఆసీస్
ఈజీ టార్గెట్ అంచనా మధ్య భారత్ అద్భుతంగా బౌలింగ్ చేసి కంగారు టీమ్ కు షాకిచ్చింది. మంచి ఆరంభం తర్వాత వరుస వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ అయింది.మార్ష్ 30 పరుగులు, షార్ట్ 20 పరుగులు చేశారు. ఆ తర్వాత వచ్చిన కంగారు టీమ్ లో ఏ ప్లేయర్ కూడా ప్రభావం చూపలేకపోయారు.
Washington Sundar wraps things up in style 👌
A terrific performance from #TeamIndia as they win the 4⃣th T20I by 4⃣8⃣ runs. 👏👏
They now have a 2⃣-1⃣ lead in the #AUSvIND T20I series with 1⃣ match to play. 🙌
Scorecard ▶ https://t.co/OYJNZ57GLXpic.twitter.com/QLh2SRqW9U— BCCI (@BCCI) November 6, 2025