ఐపీఎల్ అలర్ట్.. ఈ ముగ్గురూ అన్‌క్యాప్డ్ ప్లేయర్లు కాదు బాసూ.. గేమ్‌ఛేంజర్స్
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. రాబోయే సీజన్ కు ముందు ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు గేమ్‌ఛేంజర్స్ గా ఎదిగే అవకాశం ఉంది. రిటైన్ చేసుకోకపోతే ఈ యంగ్ స్టార్‌లపై ఫ్రాంచైజీలు కనక వర్షం కురిపించడం పక్కా.

ఐపీఎల్ 2026 కోసం సిద్ధమవుతున్న జట్లు
ఐపీఎల్ 2026 టోర్నమెంట్‌కు సంబంధించిన సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. భారత్‌లో ఐపీఎల్ కేవలం క్రికెట్ పోటీ మాత్రమే కాదు.. అది ఎంటర్‌టైన్‌మెంట్, థ్రిల్‌కు సమానమైన క్రీడా ఉత్సవం. ప్రతి జట్టు తమ రిటెన్షన్ లిస్ట్‌ను నవంబర్ 15న విడుదల చేయనుంది.
ప్రతి సీజన్‌లో జట్లు పెద్ద పేరున్న ఆటగాళ్లను రిటైన్ చేయడంలో, బిడ్లు వేయడంలో బిజీగా ఉంటాయి. కానీ కొందరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు తమ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. చిన్న పేరున్నా, పెద్దగా ప్రభావం చూపే ఈ ఆటగాళ్లను రిటైన్ చేయకపోతే ఫ్రాంచైజీలకు పశ్చాత్తాపం తప్పదని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. ఆ ప్లేయర్లను గమనిస్తే..
అశుతోష్ శర్మ: ఢిల్లీ క్యాపిటల్స్ సెన్సేషన్ ఫినిషర్
అశుతోష్ శర్మ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఫినిషర్‌గా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. లక్నో సూపర్ జెయింట్స్‌పై ఆయన ఆడిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అభిమానుల గుండెల్లో మిగిలిపోయింది. 2025లో జరిగిన ఐపీఎల్ 18వ సీజన్‌లో ఆయన 13 మ్యాచ్‌లలో 204 పరుగులు సాధించారు. ఆయన స్ట్రైక్‌రేట్ 160.90, అంటే ప్రతి బంతిని బౌండరీ దిశగా పంపించే ధోరణి చూపించారు.
ఈ ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ అశుతోష్‌ను రిటైన్ చేసే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఆయన బ్యాటింగ్ స్టైల్, శాంత స్వభావం జట్టుకు మళ్లీ బలాన్ని ఇస్తుందని టీమ్ మేనేజ్‌మెంట్ విశ్వసిస్తోంది.
శశాంక్ సింగ్: పవర్ హిట్టింగ్ కింగ్
శశాంక్ సింగ్ గత రెండు సీజన్లుగా పంజాబ్ కింగ్స్ జట్టులో భాగమయ్యారు. చివరి ఓవర్లలో పరుగుల వర్షం కురిపించే సామర్థ్యం అతని ప్రత్యేకత.
2025 సీజన్‌లో ఆయన మూడు హాఫ్ సెంచరీలతో 350 పరుగులు చేశారు. ముఖ్యంగా ఆయన లాంగ్ సిక్స్‌లు ఫ్యాన్స్‌కు అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాయి.
పంజాబ్ కింగ్స్ ఆయనను గత సీజన్‌లో ₹5.50 కోట్లకు రిటైన్ చేసింది. ఈసారి కూడా వారు శశాంక్‌ను కొనసాగిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. టీమ్ మేనేజ్‌మెంట్ ఆయన పవర్ హిట్టింగ్ సామర్థ్యంపై చాలా ఇంప్రెస్ అయిందని సమాచారం.
ప్రియాంష్ ఆర్య: యంగ్ టాలెంట్ సంచలనం
ప్రియాంష్ ఆర్య 2025లో తన బ్యాటింగ్‌తో ఐపీఎల్ లో సునామీ రేపాడు. పంజాబ్ కింగ్స్ తరఫున ఆయన 17 మ్యాచ్‌లలో 475 పరుగులు సాధించారు. ఈ ఇన్నింగ్స్‌లలో అతను ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు సాధించారు. అతని వ్యక్తిగత అత్యధిక స్కోర్ 103 పరుగులు.
పంజాబ్ కింగ్స్ ఆయనను ₹1 కోట్లకు సైన్ చేసింది. ఈ సీజన్‌లో ఆయనను రిటైన్ చేస్తారా లేదా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఆర్య స్ట్రోక్ ప్లే, కంట్రోల్, ఫిట్‌నెస్ అన్ని ఐపీఎల్ టీమ్‌ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయనను వదిలేస్తే మిగతా జట్లు పెద్ద మొత్తంలో బిడ్లు వేయడం ఖాయం.
ఐపీఎల్ 2026లో అన్‌క్యాప్డ్ స్టార్‌ల ప్రభావం
ఐపీఎల్ 2026లో ఈ ముగ్గురు ఆటగాళ్లు గేమ్‌ఛేంజర్‌లుగా ఎదిగే అవకాశం ఉంది. వారిని రిటైన్ చేయకపోతే, మిగతా ఫ్రాంచైజీలు భారీ మొత్తంలో బిడ్లు వేయడం ఖాయం. అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు తమ ప్రతిభతో ఐపీఎల్ లో పెద్ద స్టార్‌లను మించిపోయేలా ప్రదర్శనలు చేయడం కొత్త విషయం కాదు.
అందుకే అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్, ప్రియాంష్ ఆర్య లు ఐపీఎల్ 2026 వేలంలో అత్యంత డిమాండ్‌లో ఉండే క్రికెటర్లు కావొచ్చు.