- Home
- Sports
- Cricket
- INDAvsAUSA: ఆదుకున్న వృద్ధిమాన్ సాహా... ఆస్ట్రేలియా ఏతో ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా...
INDAvsAUSA: ఆదుకున్న వృద్ధిమాన్ సాహా... ఆస్ట్రేలియా ఏతో ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా...
ఆస్ట్రేలియా టూర్‌లో విరాట్ కోహ్లీ లేకపోతే భారత జట్టు ఎలా ఆడుతుందో కళ్లకు కట్టినట్టు చూపించింది ఆస్ట్రేలియా ఏ, భారత్ ఏ మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్. కెఎల్ రాహుల్, బుమ్రా, రిషబ్ పంత్ వంటి ఒకరిద్దరు మినహా టెస్టు జట్టులోని సభ్యులందరూ ఆడిన ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఓవర్‌నైట్ స్కోరుకి మరో 20 పరుగులు జోడించి మొదటి ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది ఆసీస్. మూడో రోజు టీమిండియా బ్యాట్స్‌మెన్ కుప్పకూలడం విశేషం.

ఓవర్ నైట్ స్కోరు 286/8 వద్ద మూడో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా ఏ జట్టు మరో 20 పరుగులు జోడించి స్టెకెకీ వికెట్ కోల్పోయింది.

38 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన స్టెకెకీని సిరాజ్ అవుట్ చేశాడు. మహమ్మద్ సిరాజ్‌కి ఇది మూడో వికెట్...

మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన భారత ఓపెనర్లు, రెండో ఇన్నింగ్స్‌లో కూడా పెద్దగా పరుగులు చేయలేకపోయారు...

పృథ్వీషా 31 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసిన ఆసీస్ సెంచరీ హీరో కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

24 బంతుల్లో 5 ఫోర్లతో 29 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ కూడా కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు...

మొదటి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన పూజారా... నేజర్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు...

హనుమ విహారి 67 బంతుల్లో 3 ఫోర్లతో 28 పరుగులు చేయగా... కెప్టెన్ అజింకా రహానే 79 బంతుల్లో 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...

రవిచంద్రన్ అశ్విన్ 8, ఉమేశ్ యాదవ్ 11 పరుగులు చేయగా కుల్దీప్ యాదవ్, సిరాజ్ డకౌట్ అయ్యారు...

143 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన దశలో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా... అద్భుతంగా పోరాడాడు.

100 బంతుల్లో ఏడు ఫోర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు... దీంతో 189/9 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది టీమిండియా ఏ...

రెండో ఇన్నింగ్స్‌లో జో బర్న్స్‌ని డకౌట్ చేశాడు ఉమేశ్ యాదవ్... విల్ పుకెవిస్కీ 23 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు.

హారిస్ 25, ట్రావిస్ హెడ్ 2 పరుగులతో ఉండగా 15 ఓవర్లలో వికెట్ కోల్పోయి 52 పరుగులతో ఆటను డ్రాగా ముగించారు...

మొత్తంగా ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత బౌలర్లు పర్వాలేదనిపించినా... మొదటి ఇన్నింగ్స్‌లో రహానే, పూజారా, రెండో ఇన్నింగ్స్‌లో సాహా తప్ప మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ పెద్దగా రాణించలేకపోయారు.