- Home
- Sports
- Cricket
- IND vs ENG: స్ట్రైక్ రేట్ 165.. సిక్సర్లు కొట్టడంలో మాస్టర్.. టీమిండియాలోకి వస్తున్నాడు !
IND vs ENG: స్ట్రైక్ రేట్ 165.. సిక్సర్లు కొట్టడంలో మాస్టర్.. టీమిండియాలోకి వస్తున్నాడు !
IND vs ENG: ఇంగ్లండ్‌తో జరగనున్న నాలుగో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌కి ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. ధనాధన్ బ్యాటింగ్ తో సిక్సర్ల మోత మోగించే ప్లేయర్ తిరిగి జట్టులోకి వస్తున్నాడు.

Rohit Sharma, Virat Kohli, Rinku Singh
IND vs ENG: ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్ సిరీస్ లో వరుసగా రెండు మ్యాచ్ లను గెలిచిన భారత జట్టు మస్తు జోష్ లో కనిపించింది. అయితే, మూడో మ్యాచ్ లో భారత్ దే విజయం అనుకునే లోపు ఇంగ్లాండ్ షాక్ ఇచ్చింది. భారత్ ను చిత్తుగా ఓడించింది.
రాజ్‌కోట్‌లో టీమ్ ఇండియా ఓడిపోయింది, కానీ మొదటి రెండు టీ20ల్లో ఇంగ్లండ్‌ను ఓడించిన తర్వాత, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. నాలుగో మ్యాచ్ జనవరి 31న పూణెలో జరగనుంది.
Mayank Yadav, Rinku Singh, Shivam Dube
పూణెలో జరిగే మ్యాచ్ లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని, ఆపై ఫిబ్రవరి 2న నిర్ణయాత్మక పోరును ఎదుర్కోవాలని ఇంగ్లాండ్ కోరుకుంటోంది. అదే సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అండ్ కో నాలుగో మ్యాచ్‌లోనే సిరీస్‌ను లాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇలాంటి సమయంలో భారత్‌కు ఒక గుడ్ న్యూస్ అందింది. ధనాధన్ ఇన్నింగ్స్ లను ఆడే టీమిండియా బ్యాట్స్‌మెన్ ఫిట్‌గా మారాడు. అతనే రింకూ సింగ్.
Rinku singh,
నాల్గో టెస్టులో రింకూ సింగ్ అరదగొడతాడా?
ఇంగ్లండ్‌తో జరగనున్న నాలుగో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు ఎడమచేతి వాటం స్టార్ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. పూణెలో ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టీ20 మ్యాచ్‌కు రింకూ సింగ్ ఫిట్‌గా ఉన్నాడనీ, ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చాట్ ధృవీకరించారు.
తొలి టీ20 మ్యాచ్‌లో రింకూ గాయపడ్డాడు. అందుకే రెండో, మూడో టీ20 మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సి వచ్చిందని బీసీసీఐ తెలిపింది. దీని తర్వాత రింకూ స్థానంలో రమణదీప్ సింగ్‌ను జట్టులోకి తీసుకున్నారు.
Rinku Singh-Tilak Varma-Sanju Samson
స్ట్రైక్ రేట్ 165.. సిక్సర్లు కొట్టడంలో రింకూ సింగ్ మాస్టర్
రింకూ సింగ్ ధనాధన్ ఇన్నింగ్స్ లను ఆడటంతో మంచి గుర్తింపు పొందాడు. ముఖ్యంగా సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌లు ముగించే అలవాటు అతనికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతర్జాతీయ టీ20లో అతని స్ట్రైక్ రేట్ 165గా ఉంది.
ఈ ఫార్మాట్‌లో రింకూ ఇప్పటి వరకు 31 మ్యాచ్‌లు ఆడగా, అందులో 46.09 సగటుతో 507 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచిన ప్రస్తుత సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో అతను బ్యాటింగ్ చేయలేదు.
నాల్గో టీ20కి భారత్ ప్లేయింగ్-11 అంచనాలు:
రింకూ సింగ్ పునరాగమనం తర్వాత జట్టులో ఆడటం ఖాయం. అటువంటి పరిస్థితిలో అతను ధృవ్ జురెల్‌తో భర్తీ చేయవచ్చు. సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.