MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Sports
  • Cricket
  • IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి నాకు తెలియదు.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్

IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి నాకు తెలియదు.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్

IND vs ENG Shreyas Iyer: ఇంగ్లాండ్‌తో తొలి టీ20కి ముందు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ సూర్యవంశీ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జట్టులోకి రానుండగా, వైభవ్‌పై ఉత్కంఠ నెలకొంది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 01 2026, 02:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమా? కెప్టెన్ అయ్యర్ కామెంట్స్ వైరల్!
Image Credit : Getty

వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమా? కెప్టెన్ అయ్యర్ కామెంట్స్ వైరల్!

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే మొదటి టీ20 మ్యాచ్‌ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌ కంటే ముందే టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ గురించి నెట్టింట జరుగుతున్న రచ్చపై అయ్యర్ స్పందించాడు.

అసలు వైభవ్ సూర్యవంశీ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కానీ, హైప్ కానీ తనకు అస్సలు తెలియదని అయ్యర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. లెజెండరీ క్రికెటర్లు, పొలిటీషియన్లు వైభవ్‌ను ఎంతగా పొగుడుతున్నా.. తనకు మాత్రం ఆ విషయాలేవీ తెలియవని చెప్పి అందరినీ షాక్‌కు గురిచేశాడు. అయ్యర్ మాటలను బట్టి చూస్తే తొలి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితం కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సోషల్ మీడియా ట్రెండ్స్ నేను అస్సలు చూడను
Image Credit : Getty

సోషల్ మీడియా ట్రెండ్స్ నేను అస్సలు చూడను

ప్రెస్ మీట్‌లో ఒక రిపోర్టర్ వైభవ్ సూర్యవంశీ గురించి అడిగిన ప్రశ్నకు అయ్యర్ చాలా కూల్‌గా, అంతే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఆన్సర్ ఇచ్చాడు. "నేను సోషల్ మీడియాలో మా టీమ్ ప్లేయర్స్ గురించి జరిగే చర్చలను అస్సలు పట్టించుకోను. నిజం చెప్పాలంటే ఇన్ స్టాగ్రామ్‌లో ఏం జరుగుతోంది, సోషల్ మీడియా ట్రెండ్స్‌లో ఏముందో నాకు అస్సలు తెలియదు. నేను వార్తలను కూడా అస్సలు ఫాలో అవ్వను. ఇప్పటివరకు వైభవ్ గురించి బయట జరుగుతున్న ఏ విషయాన్ని కూడా నేను వినలేదు" అంటూ అయ్యర్ క్లారిటీ ఇచ్చాడు. అయితే వైభవ్‌కు ఎప్పుడు అవకాశం వచ్చినా తను కచ్చితంగా అదరగొడతాడనే నమ్మకం తనకు ఉందని అయ్యర్ చెప్పుకొచ్చాడు.

Related Articles

Related image1
FIFA World Cup షాకింగ్ ట్విస్ట్.. పెనాల్టీ షూటౌట్ అనగానే భయంతో పారిపోయిన నలుగురు స్టార్ ప్లేయర్స్
Related image2
Telangana Tourism: హైదరాబాద్‌ కు దగ్గరలోనే.. వర్షాకాలంలో ఈ 6 ప్లేసెస్ కెళ్తే కిక్కే వేరప్పా.. !
35
గిరిరాజ్ సింగ్ ట్వీట్.. సూర్యవంశీపై భారీ అంచనాలు
Image Credit : BCCI

గిరిరాజ్ సింగ్ ట్వీట్.. సూర్యవంశీపై భారీ అంచనాలు

ఇటీవలే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌ను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో ఒక పెద్ద పోస్ట్ పెట్టారు. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, యువరాజ్ సింగ్, బ్రయాన్ లారా, గ్రేమ్ స్వాన్ లాంటి క్రికెట్ దిగ్గజాలు వైభవ్ టాలెంట్‌ను ఏకగ్రీవంగా ఒప్పుకున్నారని ఆయన గుర్తు చేశారు.

భారత బ్యాటింగ్ లైనప్‌ను వైభవ్ చుట్టూ నిర్మించవచ్చని లెజెండ్స్ అంటున్నారంటే అది మామూలు విషయం కాదని, వైభవ్ గ్లోబల్ క్రికెట్ ఫ్యూచర్ కాబోతున్నాడని గిరిరాజ్ సింగ్ అంచనా వేశారు. ఈ పోస్ట్ తర్వాత వైభవ్ ఇంగ్లాండ్‌పై డెబ్యూ చేయడం ఖాయం అనుకున్నారంతా. కానీ అయ్యర్ మాత్రం టీమ్ కాంబినేషన్స్ అనేవి చాలా సీక్రెట్ అని, ప్రత్యర్థి జట్టుకు తమ ప్లాన్స్ ముందే చెప్పలేమని సింపుల్‌గా తేల్చేశాడు.

45
మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ
Image Credit : Asianet News

మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ

మరోవైపు ఈ మ్యాచ్‌లో టీమిండియా బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రావడం దాదాపు ఖాయమైంది. టీ20 వరల్డ్ కప్ 2026 తర్వాత వరుణ్ చక్రవర్తి మళ్లీ టీమిండియా జెర్సీలో కనిపించబోతున్నాడు. ఐర్లాండ్ సిరీస్ సమయంలో ఫిట్‌నెస్ సమస్యల వల్ల అతను రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. కానీ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఇంగ్లాండ్‌లో టీమ్‌తో చేరిపోయాడు.

వరుణ్ రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. గత ఏడాది 2025లో 20 టీ20 మ్యాచ్‌ల్లో ఏకంగా 36 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ ఏడాది 2026లో ఇప్పటివరకు 23 మ్యాచ్‌లలో 29 వికెట్లు తీశాడు. మొత్తం మీద 45 అంతర్జాతీయ టీ20ల్లో 16.62 సగటుతో 73 వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాటర్లకు చెమటలు పట్టించడానికి రెడీ అయ్యాడు.

55
ఆ నలుగురు అవుట్.. టీమిండియా అంచనా ప్లేయింగ్ XI ఇదే!
Image Credit : Getty

ఆ నలుగురు అవుట్.. టీమిండియా అంచనా ప్లేయింగ్ XI ఇదే!

ఈ మ్యాచ్ చెస్టర్ లీ స్ట్రీట్ లోని రివర్‌సైడ్ గ్రౌండ్‌లో జరగనుంది. వరుణ్ చక్రవర్తి జట్టులోకి వస్తుండటంతో ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై వేటు పడే అవకాశం ఉంది. సుందర్‌తో పాటు వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్గే, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఐర్లాండ్ సిరీస్‌లో సంజూ శాంసన్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచినా, అతనికి మరో ఛాన్స్ ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

భారత జట్టు అంచనా ప్లేయింగ్ ఎలెవన్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివం దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
FIFA World Cup షాకింగ్ ట్విస్ట్.. పెనాల్టీ షూటౌట్ అనగానే భయంతో పారిపోయిన నలుగురు స్టార్ ప్లేయర్స్
Recommended image2
Telangana Tourism: హైదరాబాద్‌ కు దగ్గరలోనే.. వర్షాకాలంలో ఈ 6 ప్లేసెస్ కెళ్తే కిక్కే వేరప్పా.. !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved