MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • India vs England: బిగ్ డెసిషన్ తీసుకున్న రోహిత్ శర్మ

India vs England: బిగ్ డెసిషన్ తీసుకున్న రోహిత్ శర్మ

IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ లో భాగంగా కటక్‌లోని బారాబతి స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 09 2025, 03:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

India vs England: ఇటీవల ముగిసిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో అద్భుతమైన ఆటతో ఇంగ్లాండ్ ను చిత్తుచేసి సిరీస్ ను కైవసం చేసుకున్న భారత జట్టు.. ప్రస్తుతం అదే జట్టుతో వన్డే సిరీస్ ఆడుతోంది. 

ఇండియా-ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో భాగంగా కటక్‌లోని బారాబతి స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ సిరీస్ లో నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌ను 4 వికెట్ల తేడాతో గెలుచుకున్న తర్వాత భార‌త జ‌ట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Yashasvi Jaiswal-Jasprit Bumrah

Yashasvi Jaiswal-Jasprit Bumrah

కెప్టెన్ రోహిత్ శ‌ర్మ పెద్ద నిర్ణ‌యం తీసుకున్నాడు

క‌ట‌క్ మ్యాచ్ లో  టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. బౌలింగ్‌ను టీమిండియాకు అప్పగించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. వెటరన్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ టీం ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో చేరాడు.

దీని కోసం యంగ్ ప్లేయ‌ర్ యశస్వి జైస్వాల్‌ను టీమ్ నుంచి తొలగించాల్సి వచ్చింది. ఇది కాకుండా, కుల్దీప్ యాదవ్ కూడా ప్లేయింగ్ 11 నుంచి ఔట్ అయ్యాడు. అత‌నికి విశ్రాంతి ఇవ్వడంతో వరుణ్ చక్రవర్తికి అవకాశం లభించింది. భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్ తో వన్డే అరంగేట్రం చేసే అవకాశం లభించింది. టీమిండియా సీనియర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా వన్డే క్యాప్‌ను వరుణ్ చక్రవర్తికి అప్పగించాడు.

35

రోహిత్ శర్మ ఏం చెప్పాడంటే?

టాస్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. 'మొదటి మ్యాచ్‌లో మా ప్రదర్శన బాగుంది. అదే నాకు నచ్చింది. నేను కొంతకాలంగా మైదానంలో లేకపోయినా శక్తి చాలా బాగుంది. ఇది నల్ల నేల పిచ్ అవునో కాదో నాకు ఖచ్చితంగా తెలియదు. బహుశా అది నెమ్మదిగా వుండ‌వ‌చ్చు. నేను ఆశించేది అదే. టీమ్ లో రెండు మార్పులు జరిగాయి. యశస్వి జైస్వాల్ స్థానంలో విరాట్ కోహ్లీ వచ్చాడు. కుల్దీప్ యాదవ్ కు విశ్రాంతి ఇచ్చి అతని స్థానంలో వరుణ్ అరంగేట్రం చేయ‌నున్నాడని' తెలిపాడు.  

45
Image Credit: Getty Images

Image Credit: Getty Images

వరుణ్ చక్రవర్తి 7 విధాలుగా బౌలింగ్ చేయగలడు

భార‌త‌ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తాను 7 విధాలుగా బౌలింగ్ చేయగలనని పేర్కొన్నాడు. వీటిలో ఆఫ్‌బ్రేక్, లెగ్‌బ్రేక్, గూగ్లీ, క్యారమ్ బాల్, ఫ్లిప్పర్, టాప్‌స్పిన్, టో యార్కర్ ఉన్నాయి. వరుణ్ చక్రవర్తి ఇప్పటివరకు 18 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 33 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో అతను 70 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 83 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి తమిళనాడుకు చెందిన స్పిన్ బౌలర్. ఇంగ్లాండ్ తో జ‌రుగుతున్న రెండో వ‌న్డేతో అరంగేట్రం చేశాడు. రవీంద్ర జడేజా వన్డే క్యాప్‌ను వరుణ్ చక్రవర్తికి అందిస్తూ స్వాగతం ప‌లికాడు. 

55

భార‌త్-ఇంగ్లాండ్ జ‌ట్లు ఇవే 

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.

ఇంగ్లాండ్: ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జేమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్.. అసలు కారణం ఇదే
Recommended image2
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image3
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved