Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి థార్ బహుమతి.. ఆనంద్ మహీంద్రా.. !
Sarfaraz Khan: దేశవాళీ క్రికెట్ అద్భుతమైన ఆటతో టీమిండియాలో చోటు దక్కించుకున్న సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చాలా భావోద్వేగ క్షణాలకు సాక్షిగా నిలిచింది. సర్ఫరాజ్ తండ్రి, భార్య సహా ఇతర కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. అరంగేట్రం మ్యాచ్ లో సర్ఫరాజ్ ఖాన్ ధనాధన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. సర్ఫరాజ్ క్రికెట్ ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
కఠోర శ్రమ, దేశీ టోర్నీలో అద్భుతమైన ఆటతీరు, ఫిట్‌నెస్‌పై అలుపెరగని కృషి ఇవన్ని సాధ్యం చేసిన తర్వాత సర్ఫరాజ్‌ఖాన్‌కు టీమిండియాలో టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. సుదీర్ఘ పోరాటం తర్వాత సర్ఫరాజ్ జట్టులోకి అడుగుపెట్టాడు.
Sarfaraz Khan father and Wife
ఇంగ్లాండ్ తో జరిగిన రాజ్‌కోట్ టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీతో చెలరేగాడు. సెంచరీ కొట్టేలా కనిపించాడు కానీ, దురదృష్టవశాత్తు 62 పరుగుల వద్ద రనౌట్ గా వెనుదిరిగాడు.
Sarfaraz Khan
సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం అందరినీ ఎమోషనల్ కు గురిచేసింది. చాలా రోజుల తర్వాత టీమిండియాలో చోటు దక్కడంతో అతని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. సర్ఫరాజ్ తండ్రి, భార్య ఆనందంలో ఏడ్చేశారు. ఈ మ్యాచ్ లో ధనాధన్ బ్యాటింగ్ తో రాణించిన సర్ఫరాజ్ ఖాన్ ను చూసి గర్వపడ్డారు.
Sarfaraz Khan
సర్ఫరాజ్ ఖాన్ క్రికెట్ ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం. ఓర్పు, శ్రమ, పోరాటం.. ఇవన్నీ సర్ఫరాజ్ ఖాన్ క్రికెట్ విజయానికి రహస్యాలు. తన కొడుకు టెస్ట్ క్రికెట్ అరంగేట్రం జరుపుకోవడం కంటే తండ్రికి ఏమి కావాలి. ఈ ఉద్వేగ.. ఆనంద క్షణాల మధ్య సర్ఫరాజ్ స్ఫూర్తితో ఆనంద్ మహీంద్రా సర్ఫరాజ్ కుటుంబానికి ఒక బహుమతిని ప్రకటించారు.
Sarfaraz Khan
సర్ఫరాజ్ విజయంలో తండ్రి నౌషాద్ ఖాన్ కృషి ఎంతో గొప్పది. తన అలుపెరగని కృషి, అంకితభావం వల్లే సర్ఫరాజ్ ఖాన్ ఈ స్థాయికి ఎదిగాడు. కాబట్టి ఆనంద్ మహీంద్రా నౌషాద్ ఖాన్‌కు మహీంద్రా థార్ బహుమతిగా ఇస్తానని చెప్పారు.
Sarfaraz Khan
శ్రమ, ఓర్పు, ధైర్యం. తండ్రి కంటే బిడ్డకు స్ఫూర్తినిచ్చే మంచి గుణం ఏముంటుంది? అతను అంగీకరిస్తే స్ఫూర్తిదాయకమైన పేరెంట్‌గా ఉన్న నౌషాద్ ఖాన్‌కు మహీంద్రా థార్ బహుమతిగా ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నానని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
తొలి టెస్టు మ్యాచ్‌లో నిర్భయ బ్యాటింగ్ ప్రదర్శనతో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్ 66 బంతుల్లో 62 పరుగులు చేశాడు. కానీ చిన్న తప్పిదంతో రనౌట్‌కు బలయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్‌ను అందరూ మెచ్చుకున్నారు. అతని రనౌట్ క్రికెట్ ప్రియులను తీవ్రంగా నిరాశను, బాధను కలిగించింది.