- Home
- Sports
- Cricket
- IND vs BAN: శుభ్‌మన్ గిల్ దంచికొట్టాడు...ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చేతిలో బంగ్లాదేశ్ చిత్తు
IND vs BAN: శుభ్‌మన్ గిల్ దంచికొట్టాడు...ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చేతిలో బంగ్లాదేశ్ చిత్తు
IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భారత జట్టు ఆరంభం అదిరింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తన ప్రయాణం విజయంతో ప్రారంభించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతూ తొలి మ్యాచ్ లో విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ అదరిపోయే అరంభం అందించగా, శుభ్ మన్ గిల్ సూపర్ సెంచరీతో భారత్ కు విజయాన్ని అందించారు. బంగ్లాదేశ్ నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యాన్ని భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.
Image Credit: Getty Images
6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై భారత్ గెలుపు
ఛాంపియన్స్ ట్రోఫీ2025లో భారత జట్టు తన ప్రయాణం విజయంతో ప్రారంభించింది. యూఏఈలోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఖాతాను తెరిచింది. ఈ గెలుపుతో రోహిత్ సేన రెండు పాయింట్లు సాధించింది. తన తర్వాతి మ్యాచ్ లో ఇండియా ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్ కూడా దుబాయ్ లోనే జరగనుంది.
గిల్ సూపర్ సెంచరీ
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ తో బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. భారత జట్టు 46.3 ఓవర్లలో 4 వికెట్లకు 231 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలుచుకుంది. టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 129 బంతుల్లో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేఎల్ రాహుల్ 47 బంతుల్లో 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 36 బంతుల్లో 41 పరుగులు, విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 22 పరుగులు సాధించారు. శ్రేయాస్ అయ్యర్ 17 బంతుల్లో 15 పరుగులు, అక్షర్ పటేల్ 12 బంతుల్లో 8 పరుగులు చేశారు.
Mohamed Shami
షమీ అదరగొట్టేశాడు
బౌలింగ్‌లో భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ అదరగొట్టేశాడు. తన 10 ఓవర్ల బైలింగ్ లో 53 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఒక దశలో బంగ్లాదేశ్ 5 వికెట్లు కోల్పోయి 35 పరుగులు చేసింది. అయితే, తౌహిద్ హృదయ (100 పరుగులు), జాకర్ అలీ (68 పరుగులు) రాణించడంతో 200+ మార్కును దాటింది. షమీకి తోడుగా అక్షర్ పటేల్ 2, హర్షిత్ రాణా 3 వికెట్లు తీసుకున్నారు.
Champions Trophy
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ భారత్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ 41 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత, గిల్ తన ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లి భారత్‌ను విజయపథంలో నడిపించాడు. కేఎల్ రాహుల్, కోహ్లీలు అవసరమైన ఇన్నింగ్స్ లను ఆడారు.
దీంతో భారత్ ఈజీగానే బంగ్లాదేశ్ పై విజయాన్ని అందుకుంది. సెంచరీ కొట్టిన శుభ్ మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. భారత్ తర్వాతి మ్యాచ్ ఫిబ్రవరి 23న ఇదే మైదానంలో పాకిస్థాన్‌తో ఆడనుంది. గ్రూప్ A లో ఇది రెండవ మ్యాచ్. బుధవారం అంతకుముందు, ఆతిథ్య పాకిస్తాన్ న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది.