MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • Rohit Sharma: సచిన్, పాంటింగ్, గంగూలీ రికార్డులు బద్దలు కొట్టిన రోహిత్ శ‌ర్మ

Rohit Sharma: సచిన్, పాంటింగ్, గంగూలీ రికార్డులు బద్దలు కొట్టిన రోహిత్ శ‌ర్మ

IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు బంగ్లాదేశ్‌పై విజ‌యంతో తన ప్రచారాన్ని ప్రారంభించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ తో లెజెండ‌రీ ప్లేయ‌ర్లు స‌చిన్, పాంటింగ్, గంగూలీల రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాడు.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 20 2025, 11:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Image Credit: Getty Images

Image Credit: Getty Images

Champions Trophy 2025: ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు అద్బుతంగా త‌న ప్ర‌యాణం ప్రారంభించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో  రాణించి బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించి విజ‌యోత్సాహంతో ఛాంపియ‌న్స్ ట్రోఫీని మొద‌లుపెట్టింది.

గురువారం (ఫిబ్రవరి 20) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో భార‌త కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ రికార్డుల మోత మోగించాడు. రోహిత్ 36 బంతుల్లో 7 ఫోర్లతో 41 పరుగులు చేశాడు. దీంతో వ‌న్డే క్రికెట్ లో మ‌రో మైలురాయిని అందుకున్నాడు. రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 13 పరుగులు పూర్తి చేసిన వెంటనే వన్డే క్రికెట్‌లో 11000 పరుగుల మార్కును అందుకున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Rohit Sharma (Photo: X/@BCCI)

Rohit Sharma (Photo: X/@BCCI)

దిగ్గజాల రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన రోహిత్ శ‌ర్మ 

రోహిత్ శర్మ 11000 వన్డే పరుగులు సాధించడమే కాకుండా లెజెండ‌రీ ప్లేయ‌ర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. అత్యంత వగంగా 11వేల ప‌రుగుల మార్కును అందుకున్న రెండవ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 

వన్డేల్లో అత్యంత వేగంగా 11000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. అతను 261 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు. స‌చిన్ టెండూల్క‌ర్ 276 ఇన్నింగ్స్‌లు ఆడి 11000 ప‌రుగులు పూర్తి చేశాడు. కేవ‌లం సచిన్ మాత్ర‌మే కాదు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీలను కూడా రోహిత్ శ‌ర్మ అధిగ‌మించాడు. 

34

అత్యంత వేగంగా 11 వేల ప‌రుగులు పూర్తి చేసిన ప్లేయ‌ర్ ఎవ‌రు? 

వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు సాధించిన ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ. 222 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ ఈ ఘనతను సాధించాడు. 2019లో ఈ రికార్డును అందుకున్నాడు. 

వన్డేల్లో అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన క్రికెట‌ర్లు

విరాట్ కోహ్లీ: 222 ఇన్నింగ్స్
రోహిత్ శర్మ: 261 ఇన్నింగ్స్
సచిన్ టెండూల్కర్: 276 ఇన్నింగ్స్
రికీ పాంటింగ్: 286 ఇన్నింగ్స్
సౌరవ్ గంగూలీ: 288 ఇన్నింగ్స్

44
Rohit Sharma

Rohit Sharma

లెజెండ‌రీ ప్లేయ‌ర్ల క్ల‌బ్ లో చేరిన రోహిత్ శ‌ర్మ

రోహిత్ శర్మ 11 వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అతని కంటే ముందు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించారు. మొత్తంగా స‌చిన్ టెండూల్కర్ 452 ఇన్నింగ్స్‌లలో 18426 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 285 ఇన్నింగ్స్‌ల్లో 13963 పరుగులు చేశాడు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 11363 పరుగులు చేశాడు. రోహిత్ శ‌ర్మ 11,029 ప‌రుగులు చేశాడు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
శుభ్‌మన్ గిల్
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved