INDvsAUS: టీమిండియా అద్భుత విజయం... 2-0 తేడాతో టీ20 సిరీస్ వశం...
First Published Dec 6, 2020, 5:17 PM IST
195 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా... ఆఖరి ఓవర్ దాకా సాగిన ఉత్కంఠ మ్యాచ్‌లో అద్భుత విజయం అందుకుంది. కెఎల్ రాహుల్ మంచి ఓపెనింగ్ ఇవ్వగా శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ సునామీ ఇన్నింగ్స్‌తో విజయానికి బాటలు వేయగా... ఆఖర్లో హార్ధిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్ కలిసి మ్యాచ్‌ను ముగించారు.

195 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియాకు ఓపెనర్లు మంచి ఆరంభం అందించారు... మొదట నెమ్మదిగా బ్యాటింగ్ చేసినా, మ్యాక్స్‌వెల్ ఓవర్ తర్వాత గేరు మార్చారు.

మ్యాక్స్‌వెల్ వేసిన ఓవర్‌లో ఓ సిక్సర్, రెండు ఫోర్లు, ఓ త్రిబుల్‌తో కలిపి 19 పరుగులు రాబట్టారు కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్... ఈ ఇద్దరూ మొదటి వికెట్‌కి 56 పరుగులు జోడించారు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?