రికార్డు బద్ధలు కొట్టిన హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా... 20 ఏళ్ల తర్వాత ఆరో వికెట్‌కి...

First Published Dec 2, 2020, 3:54 PM IST

INDvsAUS: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. అయితే టాపార్డర్ ఫెయిల్ కావడంతో 152 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. అయితే ఆ తర్వాత హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కలిసి మ్యాజిక్ చేశారు. ఇద్దరు ఆల్‌రౌండర్లు చెలరేగడంతో ఆరో వికెట్‌కి అజేయ 150 పరుగుల భాగస్వామ్యం వచ్చింది. ఈ దశలో పలు రికార్డులను బద్ధలుకొట్టారు ఈ ఇద్దరు.

మొదటి వన్డేలో 90 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, మూడో వన్డేలో 92 పరుగులు చేసి వన్డేల్లో తన అత్యధిక స్కోరు నమోదుచేశాడు...

హార్ధిక్ పాండ్యా మొదటి వన్డేలో చేసిన 90, మూడో వన్డేలో చేసిన 92 పరుగులు కూడా 76 బంతుల్లోనే రావడం విశేషం. హార్ధిక్ పాండ్యా వన్డేల్లో బెస్ట్ ఇన్నింగ్స్‌గా చెప్పుకునే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో తాను చేసిన స్కోరు కూడా 76 పరుగులే.

మూడు వన్డేల సిరీస్‌లో 210 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా... టీమిండియా తరుపున వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు.

ఆస్ట్రేలియాపై ఆరో వికెట్‌కి అజేయంగా 150 పరుగుల భాగస్వామ్యం జోడించిన హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా... ఆస్ట్రేలియాపై ఆరో వికెట్‌కి రెండో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పారు. బెండ్రన్ మెక్‌కల్లమ్, మెక్‌మిలన్ కలిసి ఆసీస్‌పై ఆరో వికెట్‌కి 165 పరుగులు జోడించారు.

ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో ఆరో వికెట్‌కి ఇదే అత్యధిక భాగస్వామ్యం... టీమిండియా తరుపున ఓవరాల్‌గా ఆరో వికెట్‌కి ఇది మూడో అత్యధికం. ఇంతకుముందు బిన్నీ, రాయుడు కలిసి 160 పరుగులు, యువరాజ్, ధోనీ కలిసి 158 పరుగులు జింబాబ్వేపై జోడించారు...

హార్దిక్ పాండ్యా టాప్ 4 హైయెస్ట్ వ్యక్తిగత స్కోర్లు అన్నీ ఆస్ట్రేలియాపైనే సాధించాడు. 2017లో 78, 83 పరుగులు చేసిన పాండ్యా, 2020లో 90, 92 పరుగులతో అదరగొట్టాడు.

ఆస్ట్రేలియాలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా కపిల్ దేవ్ తర్వాతి స్థానంలో నిలిచాడు రవీంద్ర జడేజా... కపిల్ దేవ్ 1980లో 75 పరుగులు చేయగా, నేటి వన్డేలో రవీంద్ర జడేజా 66 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు...

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలు చేసిన మూడో లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు హార్ధిక్ పాండ్యా... ఇంతకుముందు సురేష్ రైనా, ధోనీ మాత్రమే ఈ ఫీట్ సాధించారు.

ఆస్ట్రేలియాపై వన్డేల్లో ఇంతకుముందు రాబిన్ సింగ్, సదగోపన్ రమేష్ కలిపి ఆరో వికెట్‌కి 123 పరుగులు జోడించారు. 1999లో క్రియేట్ చేసిన ఈ రికార్డును 21 ఏళ్ల తర్వాత బద్ధలుకొట్టారు హార్దిక్, జడేజా.

రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా లాంటి అరకోర ఆల్‌రౌండర్లకు తాను వన్డే జట్టులో చోటు ఇవ్వనని సంజయ్ మంజ్రేకర్ కామెంట్ చేసిన తర్వాత రోజే ఈ ఇద్దరూ తమ సత్తా చాటడం విశేషం.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?