INDvsAUS: భారీ స్కోరు చేసిన ఆస్ట్రేలియా... మాథ్యూ వేడ్, స్మిత్ మెరుపులు...
First Published Dec 6, 2020, 3:20 PM IST
INDvAUS 2nd T20: టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించిన టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంది. బ్యాటింగ్‌కి అనుకూలించే సిడ్నీ పిచ్‌పై భారత బౌలర్లు వికెట్లు తీయడానికి కష్టపడడంతో తమకి అచొచ్చిన పిచ్‌పై మరోసారి భారీ స్కోరు చేసింది ఆతిథ్య ఆసీస్. 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది ఆస్ట్రేలియా...

ఆస్ట్రేలియా వికెట్ కీపర్, తాత్కాలిక కెప్టెన్ మాథ్యూ వేడ్ ఓపెనర్‌గా వచ్చి... మొదటి ఓవర్ నుంచే భారత బౌలర్లపై తన ప్రతాపం చూపించాడు... వరుస బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

షార్ట్ పెద్దగా పరుగులు చేయకపోయినా మొదటి వికెట్‌కి 47 పరుగుల భాగస్వామ్యం వచ్చిందంటే అది మాథ్యూ వేడ్ విధ్వంసకర బ్యాటింగ్ మహాత్యమే...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?