INDvsAUS: కొండంత లక్ష్యం కొట్టలేకపోయారు... ఆసీస్‌దే వన్డే సిరీస్... రెండో వన్డేలోనూ ఓడిన టీమిండియా...
First Published Nov 29, 2020, 5:18 PM IST
INDvsAUS: 390 పరుగుల కొండంత లక్ష్యం... భారత బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చిన చోట, కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియన్ బౌలింగ్ విభాగం... ఎంత బాదినా, ఎంత పోరాడినా కావాల్సిన ఫలితం మాత్రం రాలేదు. భారీ లక్ష్యచేధనలో బ్యాటింగ్‌కి దిగిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ వీరోచిత పోరాటం చేసినా... టార్గెట్‌ను అందుకోలేకపోయింది. వరుసగా రెండు వన్డేల్లోనూ ఓడి, 2-0 తేడాతో వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 338 పరుగులు మాత్రమే చేయగలిగింది టీమిండియా. ఫలితంగా ఆస్ట్రేలియా 51 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?