- Home
- Sports
- Cricket
- పింక్ బాల్ టెస్టులో మొదటి రోజు ఆస్ట్రేలియాదే పైచేయి... విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసినా..
పింక్ బాల్ టెస్టులో మొదటి రోజు ఆస్ట్రేలియాదే పైచేయి... విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసినా..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 89 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది టీమిండియా. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, రెండో బంతికే పృథ్వీషా వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించగా వైస్ కెప్టెన్ అజింక రహానే, టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ పూజారా రాణించారు. మొదటి రోజే 6 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌లో పైచేయి సాధించింది.

ప్రాక్టీస్ మ్యాచుల్లో ఫెయిల్ అయిన పృథ్వీషాను క్లీన్ బౌల్డ్ చేసిన మిచెల్ స్టార్క్... మొదటి ఓవర్‌లోనే టీమిండియాకు షాక్ ఇచ్చాడు...

ఆ తర్వాత మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పూజారా కలిసి జాగ్రత్తగా ఆడుతూ 18 ఓవర్లలో 32 పరుగులు జోడించారు.

అయితే 40 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్‌ను ప్యాట్ కమ్మిన్స్ బౌల్డ్ చేశాడు...

ఆస్ట్రేలియా బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన ఛతేశ్వర పూజారా 160 బంతుల్లో 2 ఫోర్లతో 43 పరుగులు చేశాడు...

ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్‌కి 68 పరుగులు జోడించారు. టెస్టుల్లో ఈ ఇద్దరి మధ్య ఇది వరుసగా ఐదో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం...

147 బంతుల తర్వాత తొలి బౌండరీ కొట్టిన పూజారాని నాథన్ లియాన్ అవుట్ చేశాడు. లియాన్ బౌలింగ్‌లో పూజారా అవుట్ అవ్వడం ఇదే పదోసారి...

టెస్టుల్లో 50వ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న విరాట్ కోహ్లీ... 180 బంతుల్లో 8 ఫోర్లతో 74 పరుగులు చేశాడు...

అజింకా రహానేతో కలిసి నాలుగో వికెట్‌కి 88 పరుగులు జోడించిన కోహ్లీ... రహానే తొందరపాటు కాల్ కారణంగా రనౌట్ అయ్యాడు..

92 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు చేసిన అజింకా రహానే కూడా స్టార్క్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడంతో వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది భారత జట్టు...

25 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసిన హనుమ విహారి... జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 206 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది టీమిండియా...

వృద్ధిమాన్ సాహా 25 బంతుల్లో ఒక ఫోర్‌తో 9 పరుగులు... రవిచంద్రన్ అశ్విన్ 17 బంతుల్లో ఓ ఫోర్‌తో 15 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు...

ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్‌కి 2 వికెట్లు దక్కగా, జోష్ హజల్‌వుడ్, ప్యాట్ కమ్మిన్స్, నాథన్ లియాన్ తలా ఓ వికెట్ తీశారు...