బౌలర్లను విసిగించి, రికార్డులు సృష్టించిన పూజారా... అతని బౌలింగ్‌లోనే పదోసారి...

First Published Dec 17, 2020, 2:14 PM IST

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా... 50 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ పృథ్వీషా ఇన్నింగ్స్ రెండో బంతికే డకౌట్ కాగా... మయాంక్ అగర్వాల్ 17 పరుగులు చేసి పెవిలియన్ చేర్చాడు. జిడ్డు బ్యాటింగ్‌తో ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన ఛతేశ్వర్ పూజారా... నాథన్ లియాన్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 100 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది భారత జట్టు...

విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా కలిసి మూడో వికెట్‌కి 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు... ఈ ఇద్దరి మధ్య ఇది వరుసగా ఐదో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం...

టెస్టుల్లో టీమిండియా తరుపున అత్యధిక సార్లు 50+ భాగస్వామ్యం నెలకొల్పిన భారత జోడిగా నిలిచారు పూజారా, విరాట్ కోహ్లీ...

ఆరోసారి ఈ ఫీట్ సాధించిన పూజారా, కోహ్లీ... సచిన్ టెండూల్కర్ - రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్- రాహుల్ ద్రావిడ్ రికార్డును సమం చేశారు...

ఛతేశ్వర్ పూజారా తాను ఎదుర్కొన్న మొదటి 100 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి... ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు...

గత పర్యటనలో 100 బంతులు ఎదుర్కొన్న మొదట బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన పూజారా, ఈసారి కూడా 100 బంతులు ఎదుర్కొన్న మొదటి ప్లేయర్‌గా నిలిచాడు...

ఆస్ట్రేలియాపై టెస్టుల్లో 100 అంతకంటే బంతులు ఎదుర్కోవడం పూజారాకి ఇది ఏడోసారి...

రాహుల్ ద్రావిడ్ (12 సార్లు), సచిన్ (11), విరాట్ కోహ్లీ (10), వీవీఎస్ లక్ష్మణ్ (9), గవాస్కర్ (8) మాత్రమే ఛతేశ్వర్ పూజారా కంటే ముందు ఎక్కువ సార్లు ఈ ఫీట్ సాధించారు..

ఛతేశ్వర్ పూజారా మొదటి బౌండరీ కొట్టడానికి 148 బంతులు తీసుకున్నాడు... 147 బంతుల్లో బౌండరీ సాధించని పూజారా, ఆ తర్వాత రెండు బంతుల్లో రెండు బౌండరీలు బాదాడు...

160 బంతుల్లో 2 ఫోర్లతో 43 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా... నాథన్ లియాన్ బౌలింగ్‌లో లబుషేన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

తొలుత అంపైర్ అవుట్ ఇవ్వకపోయినా సరైన సమయంలో రివ్యూ తీసుకున్న ఆస్ట్రేలియా... బౌలర్లను విసుగిస్తున్న పూజారా వికెట్‌ను సాధించింది...

నాథన్ లియాన్ బౌలింగ్‌లో పూజారా అవుట్ అవ్వడం ఇది పదోసారి. పూజారాను అత్యధికసార్లు అవుట్ చేసిన బౌలర్‌గా నిలిచాడు లియాన్.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?