INDvsAUS: టీ20ల్లోనూ అదే తడబ్యాటు... భారత బ్యాట్స్‌మెన్ ఫెయిల్.. ఆస్ట్రేలియా ముందు ఈజీ టార్గెట్...
First Published Dec 4, 2020, 3:28 PM IST
INDvAUS: వన్డే సిరీస్‌ను కోల్పోయినా టీమిండియా ఆటతీరులో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా... ప్రత్యర్థికి భారీ టార్గెట్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నా... కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా ముకుమ్మడిగా విఫలం అయ్యారు. రవీంద్ర జడేజా ఆఖర్లో మెరుపులు మెరిపించడంతో ఓ మాదిరి స్కోరు అయినా చేయగలిగింది టీమిండియా. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది భారత జట్టు.

ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఇబ్బందిగా కనిపించిన శిఖర్ ధావన్ 6 బంతులు ఎదుర్కొని కేవలం సింగిల్ మాత్రమే తీసి పెవిలియన్ చేరాడు. 11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా.

విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ కలిసి రెండో వికెట్‌కి 37 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 9 బంతుల్లో 9 పరుగులు చేసిన విరాట్ స్వీపన్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?