MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • IND vs AFG: లక్నోలో గిల్, ఇషాన్ కిషన్ సెంచరీల మోత.. అఫ్గానిస్తాన్‌ బౌలర్లకు చుక్కలు !

IND vs AFG: లక్నోలో గిల్, ఇషాన్ కిషన్ సెంచరీల మోత.. అఫ్గానిస్తాన్‌ బౌలర్లకు చుక్కలు !

India vs Afghanistan: అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సెంచరీలతో చెలరేగారు. అద్భుతమైన బ్యాటింగ్ తో రికార్డుల మోత మోగించారు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 17 2026, 04:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కెప్టెన్ ఇన్నింగ్స్‌తో గిల్ రికార్డుల వేట.. ఇషాన్ కిషన్ మాస్ కంబ్యాక్ సెంచరీ
Image Credit : X/BCCI

కెప్టెన్ ఇన్నింగ్స్‌తో గిల్ రికార్డుల వేట.. ఇషాన్ కిషన్ మాస్ కంబ్యాక్ సెంచరీ

లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాప్ గేర్‌లో దూసుకెళ్తోంది. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న అఫ్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ నిర్ణయం పూర్తిగా తప్పని భారత బ్యాటర్లు నిరూపించారు.

ముఖ్యంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ లక్నో పిచ్‌పై అఫ్గాన్ బౌలర్లతో ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఇద్దరూ పోటీ పడి మరీ సెంచరీలు బాదడంతో భారత్  37 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి  322 పరుగులు చేసింది. ప్రస్తుతం కరెంట్ రన్ రేట్ 8.7 గా ఉందంటేనే మనోళ్లు ఏ రేంజ్‌లో కుమ్మేశారో అర్థం చేసుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ మిస్.. సీన్‌లోకి ఇషాన్ కిషన్
Image Credit : X/BCCI

రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ మిస్.. సీన్‌లోకి ఇషాన్ కిషన్

టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ త్వరగానే అవుటైనప్పటికీ, మరో ఓపెనర్ రోహిత్ శర్మ (48 పరుగులు, 39 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే హాఫ్ సెంచరీకి కేవలం రెండు పరుగుల దూరంలో ఉన్నప్పుడు, 13.1 ఓవర్ వద్ద అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వేసిన గూగ్లీకి రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

96 పరుగుల వద్ద రెండో వికెట్ పడిన తర్వాత క్రీజులోకి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వచ్చాడు. ఇషాన్ రాకతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. గిల్‌తో కలిసి ఇషాన్ అఫ్గాన్ బౌలింగ్ ఎటాక్‌ను పూర్తిగా చిన్నాభిన్నం చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 170 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని (119 బంతుల్లో) నెలకొల్పారు.

35
లక్నో హీట్‌లో గిల్ క్లాస్ సెంచరీ
Image Credit : X/BCCI

లక్నో హీట్‌లో గిల్ క్లాస్ సెంచరీ

లక్నోలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సాధారణంగా ఇచ్చే రెండు డ్రింక్స్ బ్రేక్‌లకు బదులు మూడు బ్రేకులు ఇచ్చారు. విపరీతమైన ఉక్కపోత ఉన్నప్పటికీ శుభ్‌మన్ గిల్ అస్సలు తగ్గలేదు. మెడకు ఐస్ ప్యాక్ కట్టుకుని మరీ బ్యాటింగ్ కొనసాగించాడు. టెస్టులో సెంచరీ, మొదటి వన్డేలో నాటౌట్ 84 పరుగుల తర్వాత గిల్ తన ఫామ్‌ను ఇక్కడా కంటిన్యూ చేశాడు.

సమీ వేసిన 32.1 ఓవర్‌లో లెగ్ సైడ్ వచ్చిన బంతిని ఫైన్ లెగ్ మీదుగా బౌండరీకి తరలించి వన్డేల్లో తన 9వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో (19 ఇన్నింగ్స్‌లు) 1000 పరుగులు పూర్తి చేసిన భారత బ్యాటర్‌గా గిల్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. సెంచరీ తర్వాత గిల్ తన హెల్మెట్ తీసి, బ్యాట్ పైకెత్తి, తన సిగ్నేచర్ స్టైల్‌లో మైదానానికి వంగి నమస్కరిస్తూ సెంచరీ సంబరాలు చేసుకున్నాడు. గిల్ 79 బంతుల్లో 20 ఫోర్లు, 2 సిక్సర్లతో 137 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.

Shubman Gill in his element ✨

Well played Captain 👏

Updates ▶️ https://t.co/JYJ5l44iJ6#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/pIQdF3MDWn

— BCCI (@BCCI) June 17, 2026

45
ఇషాన్ కిషన్ ఊరమాస్ ఇన్నింగ్స్
Image Credit : X/BCCI

ఇషాన్ కిషన్ ఊరమాస్ ఇన్నింగ్స్

మరోవైపు వికెట్ కీపర్ రేసులో తానే అందరికంటే ముందున్నానని మొహిత్ శర్మ అన్న మాటలను ఇషాన్ కిషన్ నిజం చేశాడు. మొదట్లో కాస్త సెటిల్ అవ్వడానికి టైమ్ తీసుకున్న ఇషాన్, ఆ తర్వాత అఫ్గాన్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. రషీద్ ఖాన్, సమీ, ఘజన్‌ఫర్ ఓవర్లలో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు.

రషీద్ ఖాన్ వేసిన 31వ ఓవర్లో ఒక సిక్స్, రెండు ఫోర్లతో ఏకంగా 16 పరుగులు పిండుకున్నాడు. 32.4 ఓవర్ వద్ద బిల్ సమీ వేసిన షార్ట్ బాల్‌ను మిడ్ వికెట్ మీదుగా బౌండరీ లైన్‌కు పంపి ఇషాన్ కిషన్ 95 పరుగులకు చేరుకున్నాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తూ 71 బంతుల్లోనే 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 103 పరుగులు చేసి అఫ్గాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 125 పరుగులతో ఔట్ అయ్యాడు. 

Shubman Gill's eye-pleasing class 😇

Ishan Kishan's fearless flair 😎

Another fruitful partnership for #TeamIndia 🤝

Updates ▶️ https://t.co/JYJ5l44iJ6#INDvAFG | @IDFCFIRSTBank | @ShubmanGill | @ishankishan51 pic.twitter.com/AEnf28O0q7

— BCCI (@BCCI) June 17, 2026

55
కెప్టెన్ల ఫాస్టెస్ట్ సెంచరీల లిస్టులో గిల్
Image Credit : X/BCCI

కెప్టెన్ల ఫాస్టెస్ట్ సెంచరీల లిస్టులో గిల్

భారత కెప్టెన్ల తరఫున అత్యంత వేగంగా వన్డే సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో శుభ్‌మన్ గిల్ చేరాడు. కేవలం 77 బంతుల్లోనే గిల్ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ లిస్టులో రోహిత్ శర్మ (63 బంతులు - అఫ్గానిస్తాన్‌పై 2023లో), వీరేంద్ర సెహ్వాగ్ (69 బంతులు), విరాట్ కోహ్లీ (76 బంతులు) మొదటి స్థానాల్లో ఉన్నారు. గిల్ ఈ సెంచరీతో అఫ్గాన్‌పై తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
శుభ్‌మన్ గిల్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs AFG: వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. సంజూ వచ్చేశాడు.. భారత తుది జట్టు ఇదే
Recommended image2
Asia Cup 2026 Final: దుబాయ్ లో బిగ్ ఫైట్.. 8వ సారి ఆసియా కప్‌పై కన్నేసిన భారత్
Recommended image3
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Related Stories
Recommended image1
Kainchi Dham: కోహ్లీ, స్టీవ్ జాబ్స్, మార్క్ జూకర్ బర్గ్ జీవితాలను మార్చిన ఆలయం.. కైంచీ ధామ్ సీక్రెట్ ఇదే !
Recommended image2
INDW vs NEDW T20 WC: పాకిస్తాన్‌పై విక్టరీ తర్వాత నెదర్లాండ్స్‌తో టీమిండియా ఫైట్.. షెఫాలీ వర్మపైనే అందరి ఫోకస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved