- Home
- Sports
- Cricket
- IND A vs AUS A: అజింకా రహానే అజేయ శతకం... పూజారా హాఫ్ సెంచరీ... యంగ్ బ్యాట్స్‌మెన్ ఫెయిల్...
IND A vs AUS A: అజింకా రహానే అజేయ శతకం... పూజారా హాఫ్ సెంచరీ... యంగ్ బ్యాట్స్‌మెన్ ఫెయిల్...
టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే విరాట్ కోహ్లీ లేకుంటే భారత జట్టు బలమెంతో నిరూపించేలా సాగుతోంది ఆస్ట్రేలియా ఏ జట్టుతో టీమిండియా ఏ ప్రాక్టీస్ మ్యాచ్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఏ జట్టు మొదటి రోజు ఆట ముగిసేసమయానికి 8 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. కెప్టెన్ అజింకా రహానే సెంచరీతో అజేయంగా బ్యాటింగ్ చేస్తుండగా టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పూజారా హాఫ్ సెంచరీతో రాణించాడు.
మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత ఏ జట్టు కెప్టెన్ అజింకా రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

యంగ్ సెన్సేషన్ బ్యాట్స్‌మెన్ పృథ్వీషా, శుబ్‌మన్ ఇద్దరూ డకౌట్లుగా వెనుదిరిగారు. పృథ్వీషా 8 బంతులాడి డకౌట్ కాగా, శుబ్‌మన్ గిల్ గోల్డెన్ డక్ అయ్యాడు.

సున్నాకే తొలి వికెట్ కోల్పోయిన భారత ఏ జట్టు, 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. హనుమ విహారి 51 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో 40 పరుగుల వద్ద మూడో వికెట్ పడింది.

ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే కలిసి నాలుగో వికెట్‌కి 66 పరుగులు జోడించారు. ఈ దశలో 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు పూజారా...

140 బంతుల్లో 54 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా... జేమ్స్ ప్యాటిన్సన్ బౌలింగ్‌లో హారిస్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

ఆ వెంటనే వృద్ధిమాన్ సాహా కూడా నాలుగు బంతులాడి పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు... టీమిండియా ఏ ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా, శుబ్‌మన్ గిల్, సాహా డకౌట్ కావడం విశేషం.

10 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్ కూడా ప్యాటిన్సన్ బౌలింగ్‌లోనే అవుట్ కావడంతో 128 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది భారత ఏ జట్టు.

అయితే కుల్దీప్ యాదవ్‌తో కలిసి ఏడో వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు అజింకా రహానే... కుల్దీప్ యాదవ్ 78 బంతుల్లో ఒక ఫోర్‌తో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఉమేశ్ యాదవ్ 18 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...

228 బంతులు ఎదుర్కొన్న అజింకా రహానే 16 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

మొదటి రోజు ఆట ముగిసేసమయానికి 90 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది టీమిండియా.

యంగ్ బ్యాట్స్‌మెన్ ఫెయిల్ అయినా విరాట్ కోహ్లీ గైర్హజరీతో మూడు టెస్టులకు తాత్కలిక కెప్టెన్‌గా వ్యవహారించబోతున్న రహానే... టెస్టు ఇన్నింగ్స్ ఎలా ఆడాలో కుర్రాళ్లకు ఆడి చూపించాడు.

వృద్దిమాన్ సాహా డకౌట్ కావడంతో యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఎందుకు ఆడించడం లేదని ట్వీట్లు చేస్తున్నారు అభిమానులు.