రహానేకి కాదు, రోహిత్ శర్మకు టెస్టు కెప్టెన్సీ ఇవ్వాలి... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్...

First Published 9, Nov 2020, 9:24 PM

IPL 2020 కారణంగా మరోసారి రోహిత్ శర్మకు భారత జట్టు కెప్టెన్సీ ఇవ్వాలనే వాదన మరోసారి తెరపైకి వచ్చింది. విరాట్ కోహ్లీని టెస్టుల్లో కెప్టెన్‌గా కొనసాగించినా టీ20, వన్డే వంటి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్ శర్మ కెప్టెన్ అయితేనే కరెక్ట్ అని వాదిస్తున్నారు క్రికెట్ పండితులు. అయితే మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్‌ 2020 సీజన్‌లో గాయపడిన ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ... ఆసీస్ టూర్‌లో వన్డే, టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. అతని గాయం పూర్తిగా మానకపోవడంతో రోహిత్ శర్మకి మొదటి రెండు పొట్టి ఫార్మాట్లతో రెస్టు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.

టీ20 సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టుతో కలవబోతున్నాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ. అయితే జనవరిలో అనుష్క శర్మ డెలివరీ ఉండడంతో టెస్టు సిరీస్ నుంచి అర్థాంతరంగా స్వదేశం బయలుదేరి రానున్నాడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.

ఆడిలైడ్‌లో జరిగే మొదటి టెస్టు తర్వాత స్వదేశం బయలుదేరి రానున్నాడు విరాట్ కోహ్లీ. దీంతో మిగిలిన మూడు టెస్టులకు టెస్టుల్లో వైస్- కెప్టెన్‌గా వ్యవహారించే సీనియర్ బ్యాట్స్‌మెన్ అజింకా రహానే కెప్టెన్‌గా వ్యవహారించబోతున్నాడు.

అయితే కోహ్లీ లేనప్పుడు రహానేకి కాకుండా రోహిత్ శర్మకు కెప్టెన్సీ అప్పగించాలని అంటున్నాడు భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.

‘కోహ్లీ లేకపోవడం జట్టుపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. కానీ అతని నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి. క్రికెట్ కాకుండా ఆటగాళ్లకి ఎంతో జీవితం ఉంటుందని మనం గుర్తించాలి. ప్రతీ ఒక్కరికీ కుటుంబం చాలా ముఖ్యం’ అన్నాడు ఇర్ఫాన్ పఠాన్.

‘విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడం చాలా క్లిష్టమైన విషయం. ఆ స్థానాన్ని తీసుకోవాలంటే చాలా ఏళ్లుగా రెగ్యూలర్‌గా క్రికెట్ ఆడుతూ భిన్నమైన పరిస్థితులను ఎదుర్కొన్న క్రికెటర్ అయి ఉండాలి...

నా ఉద్దేశంలో అయితే అజింకా రహానే కంటే రోహిత్ శర్మ అయితే జట్టును విజయవంతంగా నడిపించగలడు... రహానే గురించి నేను తక్కువ చేసి మాట్లాడడం లేదు, కానీ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను నడిపించిన అనుభవం ఆసీస్ టూర్‌లో రోహిత్ శర్మకు ఉపయోగపడుతుంది...’ అన్నాడు ఇర్ఫాన్ పఠాన్.

రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు ఆసియా కప్‌తో పాటు నిధిహాస్ ట్రోఫీ కూడా గెలిచింది టీమిండియా... ఆసీస్ పిచ్‌లపై రోహిత్‌కి ఉన్న అనుభవం కూడా అతనికి అదనపు బలం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు పఠాన్.

‘ఓపెనర్‌గా రోహిత్ శర్మ రోల్ ఆసీస్ టూర్‌లో చాలా ముఖ్యం. ఆస్ట్రేలియా లాంటి క్లిష్టమైన పిచ్‌లపై రోహిత్ లాంటి బ్యాట్స్‌మెన్ చాలా అవసరం. 2008లో పెద్దగా అనుభవం లేకుండానే వన్డే సిరీస్‌లో అదరగొట్టాడు రోహిత్ శర్మ...

రోహిత్ శర్మకు ఉండే పరుగుల దాహం ప్రత్యర్థికి చాలా ప్రమాదకరం అవుతుంది. గాయం తర్వాత ఎంట్రీ ఇస్తున్న రోహిత్ శర్మ భారీగా పరుగులు చేయాలనే కోరికతో ఉంటాడు. రోహిత్ శర్మ ఫామ్‌లో ఉంటే, పిచ్‌తో బౌలర్‌తో సంబంధం లేదు...’ అంటూ వ్యాఖ్యానించాడు ఇర్ఫాన్ పఠాన్.

రోహిత్ శర్మతో పాటు సీనియర్ టెస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా రాణించడం కూడా ఆస్ట్రేలియా సిరీస్‌లో కీలకం కానుందని వ్యాఖ్యానించాడు ఇర్ఫాన్ పఠాన్. కోహ్లీ గైర్హజరీతో నాలుగో స్థానంలో రహానే అయితే బెస్ట్ అని చెప్పాడు పఠాన్.