సూర్య ఆరేళ్ల ముందే టీమిండియాలోకి వచ్చి ఉంటే... విండీస్ మాజీ దిగ్గజం కామెంట్స్...
సూర్యకుమార్ యాదవ్, ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. గత ఏడాది రెండు టీ20 సెంచరీలతో 1100లకు పైగా పరుగులు సాధించి, ఐసీసీ నెం.1 బ్యాటర్‌గా అవతరించిన సూర్య... కొత్త ఏడాదిలోనూ అదే జోష్ కొనసాగిస్తున్నాడు...

శ్రీలంకతో రెండో టీ20లో హాఫ్ సెంచరీ బాది అవుటైన సూర్యకుమార్ యాదవ్, మూడో టీ20లో అజేయ సెంచరీతో అదరగొట్టాడు. 45 టీ20 మ్యాచుల్లో 43 ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు బాదిన సూర్యకుమార్ యాదవ్, 1578 పరుగులు చేసి దుమ్మురేపాడు...
ఐపీఎల్‌లో, దేశవాళీ టోర్నీల్లో నిలకడైన ప్రదర్శనతో అదరగొడుతున్నా టీమిండియాలో చోటు దక్కించుకోవడానికి చాలా ఏళ్ల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది సూర్యకుమార్ యాదవ్...
suryakumar
2012లో ముంబై ఇండియన్స్ తరుపున ఐపీఎల్ ఆరంగ్రేటం చేసిన సూర్య, 2014లో కేకేఆర్‌కి మారిన తర్వాత వరుస అవకాశాలు దక్కించుకోగలిగాడు. 2018లో తిరిగి ముంబై ఇండియన్స్‌లోకి వచ్చి స్టార్ ప్లేయర్‌గా మారిపోయాడు..
suryakumar
2018లో 512, 2019లో 424, 2020లో 480 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్... 2020 సీజన్ ముగిసిన తర్వాత 2021లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు... ఆరంభం నుంచి అదరగొడుతూ టీమిండియాకి కీలక బ్యాటర్‌గా మారిపోయాడు...
suryakumar
45 టీ20 మ్యాచుల్లో 3 టీ20 సెంచరీలు బాదిన సూర్యకుమార్ యాదవ్ 180+ స్ట్రైయిక్ రేటుతో 1500 పరుగులు చేసిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. సూర్య వయసు ప్రస్తుతం 32 ఏళ్లు... మహా అయితే మరో నాలుగైదు ఏళ్లు మాత్రమే ఆడగలడు సూర్యకుమార్ యాదవ్..
suryakumar
‘సూర్యకుమార్ యాదవ్ 6 ఏళ్ల క్రితమే ఆరంగ్రేటం చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోండి.. ఇప్పుడు ఆడుతున్నట్టే ఆడేవాడా? లేక 30ల్లో ఆరంగ్రేటం చేయడం వల్ల ఇలా ఆడగలుగుతున్నాడా?’ అంటూ ట్వీట్ చేశాడు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్...
suryakumar
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాదిరిగా సూర్యకుమార్ యాదవ్ 20+ వయసులో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసి ఉంటే.. ఈపాటికి క్రికెట్ రికార్డులన్నీ తిరగరాసేవాడని అంటున్నారు కొందరు అభిమానులు. లేటు వయసులో ఆరంగ్రేటం చేయడం వల్ల సూర్య.. చాలా మిస్ అయ్యాడని కామెంట్లు చేస్తున్నారు...
suryakumar
మరికొందరు సూర్యకుమార్ యాదవ్ లాంటి విధ్వంసకర బ్యాటర్‌ని ఇన్నాళ్లు వేచి చూసేలా చేయడం టీమిండియా సెలక్టర్ల చేతకానితనానికి నిదర్శనంగా చెబుతున్నారు. సూర్య లేకపోవడం టీమిండియా చాలా మిస్ అయ్యిందని, అతను ఆరేడు ఏళ్ల క్రితం భారత జట్టులోకి వచ్చి ఉంటే... ఐసీసీ టైటిల్స్ కూడా గెలిపించేవాడని అంటున్నారు..
Image credit: PTI
అయితే అవకాశాల కోసం ఎదురుచూసి చూసి సూర్యకుమార్ యాదవ్ మరింత రాటు తేలాడని, ఎలాగైనా టీమిండియాలోకి రావాలనే కసితో ఇంకా మెరుగ్గా మారాడని... యంగ్ ఏజ్‌లో వచ్చి ఉంటే ఇలాంటి ఆటతీరు చూసేవాళ్ల కాదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు..