MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • Cricket
  • ఒలంపిక్స్ మెడ‌ల్ గెలిస్తే 7 కోట్ల న‌జ‌రానా.. చంద్రబాబు సర్కారు కొత్త క్రీడా పాలసీ వివ‌రాలు ఇవిగో

ఒలంపిక్స్ మెడ‌ల్ గెలిస్తే 7 కోట్ల న‌జ‌రానా.. చంద్రబాబు సర్కారు కొత్త క్రీడా పాలసీ వివ‌రాలు ఇవిగో

Andhra Pradesh New Sports Policy: ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అలాగే, ఒలంపిక్స్, ఏషియన్ గేమ్స్ విజేతలకు ఇచ్చే ప్రోత్సాహకం భారీగా పెంచుతూ స్పోర్ట్స్ ఫర్ ఆల్ విధానంతో నూతన క్రీడా పాలసీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.  

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 04 2024, 07:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Andhra Pradesh New Sports Policy: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువస్తోన్న స్పోర్ట్స్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా ఏపి స్టోర్ట్స్ నూతన పాలసీ ఉంటుందని సీఎం అన్నారు. అందరికీ క్రీడలు అనే విధానంతో తీసుకువచ్చిన పాలసీపై అధికారులతో సీఎం చర్చించారు. 

రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు నాలుగు మిషన్ ఆబ్జెక్ట్స్ తో పాలసీని సిద్ధం చేశారు. స్పోర్ట్స్ ఫర్ ఆల్, నర్చర్ టాలెంట్, స్పోర్ట్స్ ఎకో సిస్టం, గ్లోబల్ విజిబిలిటీ అనే అంశాల ప్రాతిపదికగా పాలసీని రూపొందించారు. ఈ నాలుగు మిషన్ ఆబ్జెక్ట్స్ లో అందరికీ ఆటలు, టాలెంట్ గుర్తింపు, ప్రపంచ స్థాయి శిక్షణ, ప్రోత్సాహకాలు, క్రీడాకారులకు మద్దతు, ఉద్యోగ భద్రత, ప్రపంచ స్థాయి సౌకర్యాలు, క్రీడా సంఘాలతో సమన్వయం, టెక్నాలజీ వాడకం, ప్రైవేటు రంగంతో కలిసి పనిచేయడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్ నిర్వహణ, స్పోర్స్ట్ టూరిజం వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇతర రాష్ట్రాల్లో ఉన్న పాలసీల కంటే మెరుగైన అంశాలను చేర్చారు. గ్రామ స్థాయి నుంచి క్రీడల ప్రోత్సాహకానికి అవసరమైన ప్రణాళికను పొందుపరిచారు. ఇందులో భాగంగా పలు ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఇప్పటి వరకు ఉద్యోగాల్లో ఉన్న క్రీడా కోటా రిజర్వేషన్ ను 2 శాతం  నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. యూనిఫాం సర్వీసెస్ లో 3 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పాలసీలో ప్రతిపాదించారు. 

శాప్ లో గ్రేడ్ 3 కోచ్ ల కోసం ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించిన వారికి 50 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. ఒలంపిక్స్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ చాంపియన్స్, నేషనల్ గేమ్స్, ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్ లో పతకాలు పొందిన వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రోత్సాహకాల్లో హర్యానా రాష్ట్రం ముందుండగా, ముఖ్యమంత్రి సూచనలతో కొత్త పాలసీలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రోత్సాహలు ప్రతిపాదించారు. 

35

పతకాలు సాధించే క్రీడాకారులకు భారీ ప్రోత్సాహకాలు

పతకాలు సాధించే వారికి మంచి ప్రోత్సాహకాలు అందిస్తే క్రీడల పట్ల అందరికీ ఆసక్తి పెరుగుతుందని సీఎం చంద్ర‌బాబు అభిప్రాయపడ్డారు. ఆటలు ఆడేవాళ్లకు గుర్తింపు, గౌరవం ఇవ్వాలని సీఎం అన్నారు. ఒలంపిక్స్ లో బంగారు పతకం సాధించిన వారికి ఇప్పటి వరకు రూ.75 లక్షలు ఇస్తుండగా, దీన్ని ఇకపై రూ.7 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే  రజత పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు ఇస్తుండగా, దీని ఇకపై రూ.5 కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి ఇప్పటి వరకు రూ. 30 లక్షలు ఇస్తుండగా ఇకపై రూ.3 కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. 

అలాగే  ఒలంపిక్స్ లో పాల్గొన్న వారికి రూ.50 లక్షల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని సీఎం సూచించారు. అదే విధంగా ఏషియన్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన వారికి రూ.4 కోట్లు, రజత పతకం సాధించిన వారికి రూ.2 కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.1 కోటి చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఏషియన్స్ గేమ్స్ లో పాల్గొన్న వారికి రూ.10 లక్షలు ఇవ్వాలని సూచించారు. వరల్డ్ ఛాంపియన్ ఫిప్, వరల్డ్ కప్ పోటీల్లో బంగారు పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.35 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.25 లక్షలు ఇవ్వనున్నారు.

45

నేషనల్ గేమ్స్ లో బంగారు పథకం సాధించిన వారికి రూ.10 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.5 లక్షలు, కాంస్య పథకం సాధించిన వారికి రూ.3 లక్షల ప్రోత్సాహం ఇవ్వాలని ప్రతిపాదనలు చేశారు. ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన వారికి రూ.2.50 లక్షలు, రజత పతకం సాధించిన వారికి రూ.2 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.1 లక్ష చొప్పున ప్రోత్సాహం ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

ఒలంపిక్, ఏషియన్ గేమ్స్ లో పతకాలు సాధించిన వారికి గ్రూప్-1 ఉద్యోగులుగా నియమిస్తామని తెలిపారు. అదే విధంగా స్పోర్ట్స్ సిటీగా అమరావతిని రూపొందించడంతో పాటు తిరుపతి, వైజాగ్, అమరావతిలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేయాలన్నారు. కడప, విజయవాడ, విజయనగరం క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో విజయనగరం క్రీడా పాఠశాల గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. మండల, నియోజకవర్గ స్థాయిలో క్రీడా వికాస కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలన్నారు.

55

గ్రామాల్లో సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుతం దేశంలో అత్యంత పాపులర్ అయిన స్పోర్ట్స్ లీగ్స్ లో  ఏపీ నుండి జట్లు ప్రాతినిధ్యం వహించేలా చూడాలన్నారు. ఏపీకి వరంగా సముద్ర తీరం, కొండలు, అడవులు ఉన్నాయనీ, మౌంటెయిన్ బైకింగ్, వాటర్ స్ప్రోర్ట్, నేచర్ ఫోటో గ్రఫీ, ట్రెక్కింగ్ వంటి వాటిని ఏర్పాటు చేయాలన్నారు. ఆటలు అంటే క్రికెట్ ఒక్కటే కాదని...అన్ని ఆటలను ప్రోత్సహించాలని సిఎం అన్నారు.

ఆటలను తమ గోల్ గా ఎంచుకునేవారికి ఉద్యోగ భద్రత కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయనీ, ఎక్కువ‌ మంది ఆ వైపు ప్రయాణం చేస్తారని సీఎం చంద్ర‌బాబు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకువచ్చిన విధానాల కారణంగా అనేక మంది క్రీడాకారులు తయారయ్యారనీ, వారు ఒలంపిక్స్ లో కూడా సత్తా చాటారని సీఎం అన్నారు. పిపిపి విధానంతో పాటు స్వచ్చంధంగా ఆసక్తి చూపే వ్యక్తులు, సంస్థల ద్వారా మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని అన్నారు. ఈ సూచనల ప్రకారం మార్పులు చేసి కేబినెట్ లో నూతన పాలసీ తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
క్రికెట్
పవన్ కళ్యాణ్
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC: టీమిండియా ముందు 8 టెస్టులు.. ఫైనల్ చేరాలంటే ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
Recommended image2
IND vs SL: వర్షం పడే సరికే పని ఫినిష్.. గాలే టెస్టులో శ్రీలంకను భారత్ ఎలా దెబ్బకొట్టింది?
Recommended image3
Tallest Cricketers : అత్యంత పొడగరి ఇండియన్ క్రికెటర్ ఇతడే... హైట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved