MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • కెప్టెన్సీ చేతకాకుంటే దిగిపో.. బాబర్‌పై పాక్ మాజీల ఆగ్రహం

కెప్టెన్సీ చేతకాకుంటే దిగిపో.. బాబర్‌పై పాక్ మాజీల ఆగ్రహం

T20 World Cup 2022: భారత్ తో మ్యాచ్ లో  బ్యాటింగ్ లో విఫలం అవడమే గాక  పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ చెత్త కెప్టెన్సీ నిర్ణయాలే  తమ జట్టు ఓటమికి కారణమంటున్నారు  ఆ జట్టు మాజీ క్రికెటర్లు. 

2 Min read
Author : Srinivas M
Published : Oct 26 2022, 06:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మూడు రోజుల క్రితం మెల్‌బోర్న్ వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య ముగిసిన ఉత్కంఠ పోరులో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో బ్యాటర్ గా విఫలమైన  పాక్ సారథి బాబర్ ఆజమ్, కెప్టెన్ గా కూడా విఫలమయ్యాడని ఆ దేశానికి చెందిన మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అతడు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటే బెటరని  సూచిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇదే విషయమై పాకిస్తాన్ మాజీ సారథి సలీమ్ మాలిక్   స్పందిస్తూ బాబర్  పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సలీమ్ మాట్లాడుతూ.. ‘ఇటువంటి ఒత్తిడితో కూడిన మ్యాచ్ లలో జట్టులో ఉన్న సీనియర్ ప్లేయర్ల సలహాలు తీసుకోవాలి.  ఒత్తిడితో కెప్టెన్ సతమతమవుతుంటే సీనియర్లు అతడికి సలహాలిస్తారు. అతడు తప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఆపుతారు.

36

అందుకే నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే. జట్టులో సీనియర్, జూనియర్ ప్లేయర్లు సమతూకంతో ఉండాలి. బౌలర్లకు సీనియర్ ప్లేయర్లు గైడ్ చేస్తారు. మరీ ముఖ్యంగా  ఒత్తిడి ఎక్కువగా ఉండే భారత్ తో  మ్యాచ్ లో వారి సలహాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ ప్రస్తుతం జట్టులో సీనియర్ ప్లేయర్లు ఎక్కడున్నారు..? అంతర్జాతీయంగా  అత్యంత ఒత్తిడి మధ్య మ్యాచ్ లు ఆడిన అనుభవం వారికి ఉందా..?

46

పాక్ జట్టుకు బాబర్ చాలాకాలం నుంచి సారథిగా ఉన్నాడు. ఇన్ని రోజులు గడుస్తున్నా అతడు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు.  కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి ఇంతకాలమైనా నువ్వు నీ తప్పుల నుంచి ఏమీ నేర్చుకోలదంటే నువ్వు ఆ పోస్టుకు అర్హుడివి కావు. బాబర్ ఆజమ్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం మంచిది.  చాలా మంది  కెప్టెన్సీని వదిలేశారు. దానిని పట్టుకునే వేలాడలేదు...’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

56

సలీమ్ మాలిక్ తో పాటు పాక్ మాజీ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్   కూడా బాబర్ కెప్టెన్సీపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘బాబర్ ఆజమ్ కెప్టెన్సీ పవిత్రమైన ఆవుతో సమానంగా ఉంది. దానిని (కెప్టెన్సీ) మనం విమర్శించడానికి వీళ్లేదు. బాబర్ కెప్టెన్సీ ఎంత అధ్వాన్నంగా ఉందనేది ఈ మ్యాచ్ ద్వారా మరోసారి స్పష్టమైంది.  బాబర్ కెప్టెన్సీని విమర్శిస్తే  అతడు ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడని, 32 ఏండ్లు వచ్చాక నేర్చుకుంటాడని సమాధానాలు వినిపిస్తున్నాయి.

66

భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 7 నుంచి 11 ఓవర్ వరకు  ఆ జట్టు  పరుగులు చేయడానికే ఇబ్బంది పడింది. ఓవర్ కు కనీసం నాలుగు పరుగులు కూడా రాలేదు.  మరి బాబర్ తన స్పిన్నర్లతో అప్పుడే నాలుగు ఓవర్ల కోటాను ఎందుకు పూర్తి చేయలేదు..?’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

About the Author

SM
Srinivas M
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియా జ‌ట్టు ఖ‌రారు.. ఎవ‌రు ఇన్‌, ఎవ‌రు అవుట్ అంటే.?
Recommended image2
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image3
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved