విరాట్ కోహ్లీ, ఆ మ్యాచులు ఆడితే 100 సెంచరీలు దాటేసేవాడు! - మహ్మద్ అమీర్
సచిన్ టెండూల్కర్ రికార్డులను ఒక్కొక్కటిగా బ్రేక్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు విరాట్ కోహ్లీ. అత్యధిక సార్లు ఏడాదిలో1000+ వన్డే పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, అత్యధిక విజయాలు భాగస్వామిగా నిలిచిన భారత బ్యాటర్‌గానూ చరిత్ర లిఖించాడు..
Virat Kohli-Shubman Gill
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 4 పరుగుల వద్ద రోహిత్ శర్మ అవుట్ అయినప్పుడు క్రీజులోకి వచ్చాడు విరాట్ కోహ్లీ. శుబ్‌మన్ గిల్‌తో కలిసి రెండో వికెట్‌కి 189 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు..
Virat Kohli
88 పరుగుల వద్ద అవుటైన విరాట్ కోహ్లీ, సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌పై పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమీర్ ప్రశంసల వర్షం కురిపించాడు.. పరోక్షంగా బాబర్ ఆజమ్‌ని ట్రోల్ చేశాడు..
Virat Kohli
‘ఒకవేళ విరాట్ కోహ్లీ, నేపాల్, నెదర్లాండ్స్, జింబాబ్వే, బంగ్లాదేశ్ వంటి చిన్న జట్లతో ద్వైపాక్షిక సిరీసులు ఆడితే.. ఈపాటికి సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును కూడా దాటేసేవాడు. అతను ఇలాంటి చిన్న చిన్న టీమ్స్ మీద ఆడడు..
తనకు బలమైన ప్రత్యర్థి అనిపిస్తేనే ఆడతాడు. లేదంటే కుర్రాళ్లకు ఛాన్స్ ఇస్తాడు. అతని స్థాయి, బీ-సీ గ్రేడ్ టీమ్స్‌కి కాదని విరాట్‌కి బాగా తెలుసు. అందుకే వాటిపైన సిరీస్‌లు ఆడడు..’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమీర్..
పరోక్షంగా మహ్మద్ ఆమీర్ చేసిన వ్యాఖ్యలు, బాబర్ ఆజమ్‌ని ఉద్దేశించినవే. ఐసీసీ నెం.1 వన్డే బ్యాటర్‌గా కొనసాగుతున్న బాబర్ ఆజమ్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాడు.
Babar Azam
ఆసియా కప్‌లో నేపాల్‌పై 151 పరుగులు చేసి తన ప్రతాపం చూపించిన బాబర్, ఆ తర్వాత ఒక్క సెంచరీ కూడా బాదలేకపోయాడు..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఇప్పటిదాకా మూడు హాఫ్ సెంచరీలు బాదినా... అవి అతని, ఐసీసీ నెం.1 వన్డే బ్యాటర్ ర్యాంకును కాపాడుకోవడానికి తప్ప, టీమ్‌కి పెద్దగా ఉపయోగపడలేదు..
బాబర్ ఆజమ్ చేసిన సెంచరీల్లో ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే, ఐర్లాండ్, నేపాల్, హంగ్‌కాంగ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ వంటి చిన్న చిన్న జట్లపైన వచ్చినవే...