సూర్యకుమార్ యాదవ్, పాకిస్తాన్‌లో పుట్టి ఉంటేనా... పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ కామెంట్స్...
లేటు వయసులో ఎంట్రీ ఇచ్చినా అతి తక్కువ కాలంలోనే క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. టీ20ల్లో నెం.1 బ్యాటర్‌గా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్, సెంచరీల మోత మోగిస్తూ రికార్డులను ఊచకోత కోస్తున్నాడు..
suryakumar
శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 51 బంతుల్లో 219.6 స్ట్రైయిక్ రేటుతో 112 పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్. సూర్య ఈ స్పెషల్ ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా 91 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుని, సిరీస్ సొంతం చేసుకుంది..
‘సూర్యకుమార్ యాదవ్ 30 ఏళ్లు దాటాక అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చాడు. ఈ వార్త చదివాక నాకు ఒకే ఆలోచన వచ్చింది. అతను ఇండియాలో పుట్టడం తన అదృష్టం. పాకిస్తాన్‌లో పుట్టి ఉంటేనా... ఓవర్30 పాలసీకి బలి అయ్యేవాడు...
టీమ్‌లో ఉన్నవాళ్లకి ఎంత వయసున్నా పర్లేదు, బయట ఉన్నవాళ్లకి 30 ఏళ్లు దాటితే మళ్లీ ఛాన్సు రాదు. సూర్యకుమార్ యాదవ్ 30ల్లో టీమ్‌లోకి వచ్చాడు. పాక్‌లో అయితే ఇలా జరిగేది కాదు...
Image credit: PTI
ఆటకి వయసుతో సంబంధం ఏంటో నాకైతే అర్థం కాదు. సూర్య ఆటతీరు చూస్తే, అతను ఏడాదిగా అదరగొడుతున్నాడు. 360 డిగ్రీ ప్లేయర్‌గా నిరూపించుకున్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అయితే బౌలర్లు ఏ బంతిని వేసినా బౌండరీకి తరలించాడు..
బౌలర్లు వేసిన ప్రతీ చిక్కు ప్రశ్నకు సూర్యకుమార్ యాదవ్ దగ్గర సమాధానం ఉంది. ఏ బంతిని ఎలా ఆడాలో డిక్షనరీలో రాసినట్టు కొట్టాడు. 9 సిక్సర్లు, 7 ఫోర్లతో అదరగొట్టాడు. అతని ఫిట్‌నెస్, బ్యాటింగ్ మెచ్యూరిటీ, రిఫ్లెక్షన్.. వేరే లెవెల్...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్...