- Home
- Sports
- Cricket
- టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో రిజల్ట్ రాకుండా డ్రా అయితే పరిస్థితి ఏంటి? టైటిల్ ఎవరికి ఇస్తారు?...
టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో రిజల్ట్ రాకుండా డ్రా అయితే పరిస్థితి ఏంటి? టైటిల్ ఎవరికి ఇస్తారు?...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ కోసం లండన్‌లో ప్రాక్టీస్ చేస్తోంది టీమిండియా. కెన్నింగ్టన్ ఓవల్‌లో జూన్ 7 నుంచి ఇండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మరి ఈ మ్యాచ్ డ్రా అయితే ఏం చేస్తారు?... ఎవరికి టైటిల్ అందిస్తారు?...

ఈ సీజన్‌లో 66.67 విజయాలు అందుకుని, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్‌ని 2-1 తేడాతో సొంతం చేసుకున్న టీమిండియా, 58.8 విజయాల శాతంతో రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కి వచ్చింది...
టీమిండియాకి ఇది వరుసగా రెండో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్. 2019-21 డబ్ల్యూటీసీ సీజన్‌లో టేబుల్ టాపర్‌గా ఫైనల్ మ్యాచ్ ఆడింది భారత జట్టు. అయితే న్యూజిలాండ్ చేతుల్లో ఫైనల్‌లో ఓడిన టీమిండియా, రన్నరప్‌తో సరిపెట్టుకుంది...
2021 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ నెగ్గిన న్యూజిలాండ్, ఈసారి 13 మ్యాచుల్లో నాలుగే విజయాలు అందుకుని... టాప్ 5లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది. అయితే టీమిండియా 18 టెస్టుల్లో 10 విజయాలు అందుకుని, 5 మ్యాచుల్లో ఓడింది. 3 మ్యాచులను డ్రా చేసుకుని 127 పాయింట్లతో ఫైనల్‌కి వచ్చింది..
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో 5 రోజుల పాటు రోజుకి 90 ఓవర్ల పాటు ఆట జరుగుతుంది. ఐదు రోజుల్లో ఫలితం తేలకపోతే వెలుతురు లేమి, వర్షం, ఇతర కారణాల వల్ల నష్టపోయిన ఓవర్లను రిజర్వు డేన కొనసాగిస్తారు. వర్షం కారణంగా ఐదు రోజుల్లో కలిపి 50 ఓవర్ల పాటు ఆట సాగకపోతే రిజర్వు డే రోజున ఆ 50 ఓవర్ల పాటు ఆట సాగుతుంది..
ఒకవేళ డబ్ల్యూటీసీ ఫైనల్ డ్రాగా ముగిస్తే ఇండియా- ఆస్ట్రేలియా ఇద్దరినీ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. అంతేకానీ టేబుల్ టాపర్‌గా నిలిచినంత మాత్రం ఆస్ట్రేలియాకి ఎలాంటి అడ్వాంటేజ్ ఉండదు.
అదీకాకుండా ప్రస్తుతం భారత జట్టు టెస్టుల్లో నెం.1 ర్యాంకులో కొనసాగుతోంది.. ఆస్ట్రేలియాని వరుసగా నాలుగు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీల్లోనూ ఓడించింది. దీంతో ఫైనల్ మ్యాచ్ ఫలితం తేలకుండా డ్రాగా ముగిస్తే... ఆస్ట్రేలియాతో టీమిండియా ట్రోఫీని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది..
జస్ప్రిత్ బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ తీవ్రంగా గాయపడి, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి దూరమయ్యారు. వీరిలో రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ ఇద్దరికీ కూడా కెన్నింగ్టన్ ఓవల్‌లో టీమిండియాలోని మిగిలిన బ్యాటర్ల కంటే మంచి రికార్డు ఉండడం విశేషం..