MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • నేనంత చెడ్డోన్నైతే అప్పుడే ఎందుకు చెప్పలేదు..? కనేరియా ఆరోపణలపై ధీటుగా బదులిచ్చిన అఫ్రిది

నేనంత చెడ్డోన్నైతే అప్పుడే ఎందుకు చెప్పలేదు..? కనేరియా ఆరోపణలపై ధీటుగా బదులిచ్చిన అఫ్రిది

Shahid Afridi: తనపై  పాకిస్తాన్ మాజీ స్పిన్నర్  దానిష్ కనేరియా చేస్తున్న వరుస ఆరోపణలపై  షాహిద్ అఫ్రిది స్పందించాడు.  కనేరియా ఇవన్నీ చిల్లర కోసం చేస్తున్నాడని,  శత్రుదేశం ముందు తనను అబాసుపాలు చేస్తున్నాడని వ్యాఖ్యానించాడు. 

1 Min read
Author : Srinivas M
Published : May 06 2022, 04:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గడిచిన వారం రోజులుగా తనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా కు పాక్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ధీటుగా బదులిచ్చాడు. కనేరియా ఆరోపించినట్టు తాను అంత చెడ్డవాన్నే అయితే మరి అప్పుడే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించాడు. 

26

అఫ్రిది మాట్లాడుతూ.. ‘అతడు (కనేరియా) నాకు  సోదరుడి వంటి వాడు. అయితే చీప్ పబ్లిసిటీ సంపాదించి డబ్బులు సంపాదించాలనే తలంపుతో  ఏది పడితే అది వాగుతున్నాడు. 

36

నన్ను అబద్దాల కోరు అని,  క్యారెక్టర్ లేనివాడు అనే ముందు అతడి క్యారెక్టర్ ఏంటో చూసుకుంటే బాగుంటుంది. ఒకవేళ నేను అతడిపై ఏదైనా వివక్షా పూరితంగా వ్యవహరించి ఉంటే.. చెడుగా ప్రవర్తిస్తే అప్పుడే  పీసీబీకి ఎందుకు ఫిర్యాదు చేయలేదు..? 

46

అతడు మన శత్రు దేశం (భారత్ కు సంబంధించిన ఓ ప్రముఖ మీడియా సంస్థకు  కనేరియా ఇంటర్వ్యూ ఇచ్చిన నేపథ్యంలో స్పందిస్తూ..) మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి అక్కడ మత చిచ్చు రగిలిస్తున్నాడు..’ అని ఘాటుగా సమాధానమిచ్చాడు. 

56

కాగా పాకిస్తాన్ జట్టులో అఫ్రిది వల్ల తాను చాలా ఇబ్బందులు ఎదుర్కున్నానని, అతడు తనను జట్టులోంచి తీసేయడానికి కుట్రలు పన్నాడని ఇటీవలే  కనేరియా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 

66

అంతేగాక తాను హిందువును అవడం వల్లే అఫ్రిది ఇలా చేశాడని, తనను పదే పదే ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి తెచ్చాడని సంచలన  ఆరోపణలు చేసిన నేపథ్యంలో అఫ్రిది పై విధంగా స్పందించాడు. 

About the Author

SM
Srinivas M
పాకిస్తాన్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఓటమికి 5 ముఖ్య కారణాలు ఇవే
Recommended image2
Fastest T20 WC Hundreds: 33 బంతుల్లోనే సెంచరీ కొట్టిన ఫిన్ అలెన్.. టాప్-5 ఫాస్టెస్ట్ సెంచరీలు ఇవే
Recommended image3
Finn Allen : ఇదెక్కడి మాస్ హిట్టింగ్ సామీ ! 303 స్ట్రైక్ రేట్ తో సెంచరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved