- Home
- Sports
- Cricket
- అశ్విన్‌ని తప్పించినప్పుడు, విరాట్ కోహ్లీని పక్కనబెడితే తప్పేంటి... కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్...
అశ్విన్‌ని తప్పించినప్పుడు, విరాట్ కోహ్లీని పక్కనబెడితే తప్పేంటి... కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్...
స్టీవ్ స్మిత్, జో రూట్ టెస్టుల్లో బాగా ఆడితే, వైట్ బాల్ క్రికెట్‌లో వారికి చెప్పుకోదగ్గ రికార్డు లేదు. వైట్ బాల్ క్రికెట్‌లో పరుగుల వరద పారించే రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్ వంటి ప్లేయర్లకు టెస్టుల్లో మంచి రికార్డు లేదు. అయితే ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించిన ప్లేయర్ విరాట్ కోహ్లీ. అయితే ఇప్పుడు విరాట్ టైమ్ ఏ మాత్రం బాగోలేదు...

Image credit: Getty
రెండున్నరేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోతున్న విరాట్ కోహ్లీ, పేలవ ఫామ్ కారణంగా మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి దూరమయ్యాడు. రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా తప్పుకున్న తర్వాత టీమ్‌లో విరాట్ కోహ్లీ ప్రభావాన్ని వీలైనంత తగ్గించేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది బీసీసీఐ...
Image credit: Getty
అసలే పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీకి ఇప్పుడు టీ20 టీమ్‌లో ప్లేస్ ఉంటుందా? ఉండదా? అనేది కూడా అనుమానంగా మారింది...
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 2021 వరకూ మూడు ఫార్మాట్లలో టాప్ 5లో ఉన్న విరాట్ కోహ్లీ, ఇప్పుడు టీ20ల్లో 21వ స్థానానికి పడిపోయాడు. టీ20ల్లో విరాట్ కోహ్లీ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుండడంతో అతన్ని తుదిజట్టు నుంచి తప్పించడంలో తప్పు లేదంటున్నాడు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్...
Ravi Shastri and Virat Kohli
‘అవును, ఇప్పుడు టీ20ల్లో విరాట్ కోహ్లీని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అతని కంటే మెరుగ్గా ఆడుతున్న కుర్రాళ్లు, టీమ్‌లో ప్లేస్ కోసం గట్టిగా పోటీపడుతున్నారు. అయినా వరల్డ్ నెం.2 రవిచంద్రన్ అశ్విన్‌ని టెస్టుల్లో ఆడించకుండా పక్కనబెట్టినప్పుడు, వరల్డ్ నెం.1 బ్యాటర్‌ని పక్కనబెడితే తప్పేంటి...
కొన్నేళ్లుగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అతని స్టాండెడ్స్‌కి తగ్గట్టుగా ఉండడం లేదు. కోహ్లీకి ఇంతటి క్రేజ్ రావడానికి అతని పర్ఫామెన్స్‌లే కారణంగా. ఇప్పుడు అతను పర్ఫామెన్స్ చేయనప్పుడు, కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడంలో తప్పులేదు..
టీమ్‌లో ప్రతీ ప్లేస్‌కి పోటీ ఉండాలి. అప్పుడు ప్లేయర్లు మరింత మెరుగ్గా రాణించడానికి అనునిత్యం కృషి చేస్తూ ఉంటారు. పోటీలేకపోతే టీమ్ వాతావరణం పాడైపోతుంది... కొందరు దీన్ని రెస్ట్ అంటారు, మరికొందరు పక్కనబెట్టారని అంటారు.. ఒక్కోకరు ఒక్కోలా చూస్తారు..
విరాట్ కోహ్లీని సెలక్టర్లు ఎంపిక చేయకపోతే, దానికి కారణం అతను సరిగ్గా పర్ఫామెన్స్ చేయకపోవడమే. అతని కంటే మెరుగ్గా రాణిస్తున్న ప్లేయర్లు టీమ్‌కి అందుబాటులో ఉండడమే.. కేవలం మనకున్న కీర్తిప్రతిష్టల కారణంగా టీమ్‌లో ఆడించలేం కదా...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్..
2019 జనవరి నుంచి టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. 2019 నుంచి ఇప్పటిదాకా విరాట్ కోహ్లీ 32 టీ20 మ్యాచులు ఆడి 56.45 సగటుతో 1129 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 1100, కెఎల్ రాహుల్ 1049 పరుగులతో విరాట్ తర్వాతి స్థానాల్లో నిలిచారు...