- Home
- Sports
- Cricket
- వరల్డ్ నెం.1 టెస్టు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌కి ఫైనల్‌లో దక్కని చోటు... అప్పుడు కోహ్లీ వల్లే అయితే...
వరల్డ్ నెం.1 టెస్టు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌కి ఫైనల్‌లో దక్కని చోటు... అప్పుడు కోహ్లీ వల్లే అయితే...
క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మొదలైంది. ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. అయితే వరల్డ్ నెం.1 టెస్టు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌ని పక్కనబెట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

గత వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2019-21 సీజన్‌లో 71 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్, 2021-23 సీజన్‌లో 13 మ్యాచుల్లో 61 వికెట్లు తీసి టీమిండియా తరుపున టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
Image credit: Getty
ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న రవిచంద్రన్ అశ్విన్, ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 2లో ఉన్నాడు. అయినా నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఓ స్పిన్నర్‌ని ఎంచుకున్న టీమిండియా, రవీంద్ర జడేజాకి తుది జట్టులో చోటు కల్పించి, రవిచంద్రన్ అశ్విన్‌కి మొండిచేయి చూపించింది.
Image credit: PTI
ఈ మధ్యకాలంలో అశ్విన్ లేకుండా టెస్టు మ్యాచ్ ఆడడం ఇదేమీ తొలిసారి కాదు. 2021 ఇంగ్లాండ్ పర్యటనలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన నాలుగు టెస్టులోనూ రవిచంద్రన్ అశ్విన్‌కి తుది జట్టులో చోటు దక్కలేదు...
రవీంద్ర జడేజా నాలుగు టెస్టుల్లో కలిపి మూడే వికెట్లు పడగొట్టినా, అతన్ని బ్యాటింగ్ కోసం కొనసాగించిన విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్‌ని రిజర్వు బెంచ్‌కే పరిమితం చేశాడు.
Image credit: PTI
ఈ సిరీస్‌లో నాలుగింట్లో రెండు టెస్టులు నెగ్గిన టీమిండియా, ఓ మ్యాచ్‌లో ఓడింది. వర్షం కారణంగా మొదటి టెస్టు డ్రాగా ముగిసింది కానీ లేదంటే మరో మ్యాచ్ టీమిండియా ఖాతాలో పడి ఉండేదే..
అయితే ఈ సమయంలో అశ్విన్‌కి తుది జట్టులో చోటు లేకుండా చేసినందుకు విరాట్ కోహ్లీపై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది. అశ్విన్‌కీ, విరాట్ కోహ్లీకీ మనస్పర్థలు రావడం వల్లే అతన్ని తుది జట్టులో చోటు ఇవ్వకుండా చేస్తున్నాడని విమర్శలు వచ్చాయి..
స్వయంగా రవిచంద్రన్ అశ్విన్ స్పందించి, ఈ ట్రోల్స్‌కి, వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. ఇది జరిగిన రెండేళ్లకు మళ్లీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులో చోటు దక్కించుకోకపోవడం విశేషం.
అప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఫాలో అయిన పద్ధతినే రోహిత్ టీమ్ సెలక్ట్ చేసుకోవడానికి కారణం కెన్నింగ్టన్ పిచ్ మీద ఉన్న పచ్చికే. ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలు చాలా తక్కువ. దీంతో అశ్విన్‌ని పక్కనబెట్టి, జడ్డూని బ్యాటింగ్ కోసం తుదిజట్టులోకి తెచ్చింది టీమిండియా..