ICC World cup final: ఒక్క అడుగు! ఫైనల్‌లో తేడా కొట్టిందే... అంతా గోవిందా! ఇన్నాళ్లు పొగిడిన వాళ్లే...
2014 టీ20 వరల్డ్ కప్ తర్వాత తొలిసారి ప్రపంచ కప్ ఫైనల్ ఆడుతోంది భారత జట్టు. 2023 ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఓడిన టీమిండియా, మరోసారి అదే ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్ ఫైనల్‌లో తలబడుతోంది..
2023 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా వరుసగా 10 మ్యాచుల్లో గెలిచింది. అయితే అవన్నీ ఓ లెక్క. ఆఖరి మ్యాచ్ ఓ లెక్క. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్‌లో రిజల్ట్ తేడా కొడితే, ఇన్నాళ్లు చేసిందంతా వృథా అయిపోతుంది..
Rohit Sharma
వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, షమీ, బుమ్రా, కుల్దీప్, సిరాజ్.. అందరూ టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చారు...
Rohit Sharma
ఒక్క సూర్యకుమార్ యాదవ్ తప్ప మిగిలిన టీమ్ అంతా టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చింది. విరాట్, రోహిత్, అయ్యర్ అయితే 500+ పరుగులు చేశారు... ఫైనల్‌లో ఒక్క చిన్న పొరపాటు చేస్తే, ఇన్నాళ్లు పొగిడినవాళ్లు, తిట్ల దండకం మొదలెడతారు..
Rohit Sharma
రోహిత్ శర్మ ఫియర్‌లెస్ బ్యాటింగ్‌ని, విరాట్ కోహ్లీ నిలకడైన పర్ఫామెన్స్‌ని మెచ్చుకున్నవాళ్లే.. చివరి మ్యాచ్‌లో వీళ్లు విఫలమైతే తీవ్రంగా ట్రోల్ చేసి, టీమ్‌లో నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తారు..
2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడబోతోంది భారత జట్టు. ఆ మ్యాచ్‌లో సెహ్వాగ్, సచిన్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. యువీ కంటే ముందు ధోనీ బ్యాటింగ్‌కి వచ్చాడు. అయితే అప్పటికి సోషల్ మీడియా ఇంతలా వాడుకలోకి రాలేదు..
Rohit Sharma
ఇప్పుడు పరిస్థితి వేరు. చిన్న తప్పు జరిగినా క్షమించలేని జనాలు, సోషల్ మీడియాలో నోటికి వచ్చింది, చేతికి తోచింది రాసి విద్వేషాన్ని వెల్లగక్కుతున్నారు.
భారత జట్టుపై ఎన్నో అంచనాలు పెంచేసుకున్న జనం, ఫైనల్‌లో గెలిస్తే క్రికెటర్లను దేవుళ్లుగా కొలచడానికి సిద్ధమైపోయారు. టీమిండియా, వరల్డ్ కప్ గెలిస్తే సోషల్ మీడియా యాప్స్ హ్యాంగ్ అయిపోయే రేంజ్‌లో రియాక్షన్ రావడం ఖాయం..
అదే రిజల్ట్ కాస్త తేడా కొట్టినా తమ జీవితంలోని ఫ్రస్టేషన్‌ని అంతా వారిపై చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఫైనల్‌లో ఓడితే మరోసారి 2007 వరల్డ్ కప్ సీన్స్ కంటే ఘోరమైన సన్నివేశాలే చూడాల్సి రావచ్చు. ఎందుకంటే ఇక్కడ అభిమానం హద్దులు దాటి, చాలా ఏళ్లే అవుతోంది..