నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేసిన రోహిత్ శర్మ... బంగ్లాదేశ్‌తో వరల్డ్ కప్ మ్యాచ్‌లో...
స్పిన్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చాడు రోహిత్ శర్మ. ఐపీఎల్ 2009 సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరుపున హ్యాట్రిక్ కూడా తీశాడు రోహిత్. అయితే కొన్నాళ్లుగా రోహిత్ బౌలింగ్ చేయడం మానేశాడు...
ఐపీఎల్‌లో సెంచరీ చేసి, హ్యాట్రిక్ తీసిన ఒకే ఒక్క భారత క్రికెటర్ రోహిత్ శర్మ. ఓవరాల్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ మాత్రమే ఈ ఫీట్ సాధించాడు..
Rohit Sharma
ఓపెనర్‌గా మారిన తర్వాత బ్యాటింగ్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన రోహిత్ శర్మ, దాదాపు ఏడేళ్లుగా బౌలింగ్ చేయడం లేదు. బౌలింగ్ వేస్తున్నప్పుడు తన బొటనవేలికి ఇబ్బంది కలుగుతోందని, దీని వల్ల బ్యాటింగ్‌పై ప్రభావం పడకూడదని బౌలింగ్ మానేసినట్టు చెప్పాడు రోహిత్ శర్మ..
Rohit Sharma
అయితే రోహిత్ శర్మ మళ్లీ బాల్ పట్టుకోబోతున్నట్టు తెలుస్తోంది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా పూణేలో అక్టోబర్ 19న బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడబోతోంది భారత జట్టు. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం పూణే చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలెట్టేసింది..
Rohit Sharma
ఇప్పటికే బంగ్లాదేశ్‌పై రోహిత్ శర్మకు రెండు వరల్డ్ కప్ సెంచరీలు ఉన్నాయి. 2015 వన్డే వరల్డ్ కప్‌లో, 2019 వన్డే వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌పై సెంచరీలు బాదాడు రోహిత్.. దీంతో బంగ్లాతో మ్యాచ్‌కి కూడా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు రోహిత్ శర్మ..
స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చక్కగా రాణిస్తున్నారు. అవసరమైతే శ్రేయాస్ అయ్యర్‌ని కూడా స్పిన్ బౌలర్‌గా వాడుకోవచ్చు. అయితే అతను వెన్ను సమస్యతో బాధపడుతూ టీమ్‌కి దూరమవుతూ వస్తున్నాడు.. దీంతో అదనపు స్పిన్నర్‌గా బౌలింగ్ చేసేందుకు రోహిత్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో జరిగిన మొదటి 3 మ్యాచుల్లో ఓ సెంచరీ, మరో హాఫ్ సెంచరీతో 217 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు రోహిత్ శర్మ..