MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • Cricket
  • అనుకున్నదే అయ్యింది! వరల్డ్ కప్ నుంచి అక్షర్ పటేల్ అవుట్, అశ్విన్ ఎంట్రీ...

అనుకున్నదే అయ్యింది! వరల్డ్ కప్ నుంచి అక్షర్ పటేల్ అవుట్, అశ్విన్ ఎంట్రీ...

అంతా అనుకున్నట్టుగానే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో రవిచంద్రన్ అశ్విన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. నాలుగేళ్ల పాటు వైట్ బాల్ క్రికెట్‌కి దూరంగా ఉన్న తర్వాత 2021 టీ20 వరల్డ్ కప్, 2022 టీ20 వరల్డ్ కప్ ఆడిన అశ్విన్... వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కూడా ఆడబోతున్నాడు.. 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 29 2023, 09:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Ravichandran Ashwin

Ravichandran Ashwin

2011 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్, 2 మ్యాచులు ఆడి 4 వికెట్లు తీశాడు. 2015 వన్డే వరల్డ్ కప్‌లో 8 మ్యాచుల్లో 13 వికెట్లు తీసిన అశ్విన్, 2019 వన్డే వరల్డ్ కప్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

2015 వన్డే వరల్డ్ కప్‌కి ఎంపికైనా రిజర్వు బెంచ్‌లోనే కూర్చున్నాడు అక్షర్ పటేల్. 2019 వన్డే వరల్డ్ కప్‌కి ఎంపిక కాని అక్షర్ పటేల్, 2023 ప్రపంచ కప్‌కి ఎంపికైనా ఫిట్‌నెస్ లేకపోవడంతో ఈసారి కూడా వరల్డ్ కప్ ఆడే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు..

38
Ravichandran Ashwin

Ravichandran Ashwin

2011 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడిగా ఉండి, 2023 వన్డే వరల్డ్ కప్ ఆడబోతున్న రెండో భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. విరాట్ కోహ్లీ కూడా 2011 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌‌లో సభ్యుడిగా ఉన్నాడు..

48

వార్మప్ మ్యాచుల ఆరంభానికి ముందు టీమ్‌లో అక్షర్ పటేల్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌కి చోటు కల్పిస్తున్నట్టు ప్రకటించింది సెలక్షన్ కమిటీ. 2010లో వన్డే ఆరంగ్రేటం చేసిన అశ్విన్, 115 వన్డేల్లో 155 వికెట్లు తీశాడు..
 

58
Ravichandran Ashwin

Ravichandran Ashwin

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి వన్డేలో 47 పరుగులిచ్చి ఓ వికెట్ తీసిన అశ్విన్, రెండో వన్డేలో 41 పరుగులకు 3 వికెట్లు తీసి సెలక్టర్లను ఇంప్రెస్ చేశాడు. మూడో వన్డేలో అశ్విన్ ప్లేస్‌లో వాషింగ్టన్ సుందర్‌కి అవకాశం దక్కింది..
 

68
Ravichandran Ashwin

Ravichandran Ashwin

వాషింగ్టన్ సుందర్, రాజ్‌కోట్‌లోని బ్యాటింగ్ పిచ్‌లో 10 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి 48 పరుగులే ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో భారత బౌలర్లలో 6లోపు ఎకానమీతో బౌలింగ్ చేసింది సుందర్ ఒక్కడే. అతన్ని ఓపెనర్‌గానూ ఆడించింది టీమిండియా..

78
Ravichandran Ashwin

Ravichandran Ashwin

ఓపెనర్‌గా వచ్చిన వాషింగ్టన్ సుందర్ 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సుందర్ మరీ ఫ్లాప్ కాకపోయినా రవిచంద్రన్ అశ్విన్ అనుభవం టీమిండియాకి బాగా ఉపయోగపడుతుందని ఉద్దేశంతో అతనికే ఓటు వేశారు సెలక్టర్లు.. 

88
Ravichandran Ashwin

Ravichandran Ashwin

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన రవిచంద్రన్ అశ్విన్, వరుసగా మూడో వైట్ బాల్ ఐసీసీ వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆడబోతుండడం విశేషం.. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved