ఇండియా- న్యూజిలాండ్ మధ్య వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్... ఆకాశ్ చోప్రా కామెంట్..
ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆడిన మొదటి నాలుగు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకున్న రెండు జట్లు ఇండియా, న్యూజిలాండ్. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఐదు మ్యాచుల తర్వాత అజేయంగా నిలిచే జట్టు ఏదో తేలిపోనుంది..
న్యూజిలాండ్ మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. ఆ తర్వాత నెదర్లాండ్స్‌పై 88 పరుగుల తేడాతో, బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో.. తాజాగా ఆఫ్ఘాన్‌పై 149 పరుగుల తేడాతో విజయాలు అందుకుంది..
భారత జట్టు, మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో ఆ తర్వాత ఆఫ్ఘాన్‌పై 8 వికెట్ల తేడాతో, పాకిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో, తాజాగా బంగ్లాదేశ్‌పై కూడా 7 వికెట్ల తేడాతో విజయాలు అందుకుంది.
భారత జట్టు మొదటి 4 మ్యాచుల్లో రెండోసారి బ్యాటింగ్ చేసి ఆ లక్ష్యాలను విజయవంతంగా ఛేదించింది. 20 ఏళ్లుగా న్యూజిలాండ్‌పై ఐసీసీ మ్యాచ్ గెలవలేకపోయింది భారత జట్టు. 2003 వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు, న్యూజిలాండ్‌పై ఐసీసీ మ్యాచ్ గెలవలేదు..
New Zealand vs Afghanistan
‘న్యూజిలాండ్ అద్భుతమైన జట్టు. నా ఉద్దేశంలో ఇండియా-న్యూజిలాండ్ మధ్య వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగవచ్చు. వాళ్లు మొదటి నాలుగు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకున్నారు. సెమీ ఫైనల్ చేరడం పెద్ద కష్టమేమీ కాదు..
న్యూజిలాండ్ టీమ్ చాలా పటిష్టంగా ఉంది. కేన్ విలియంసన్ ఆడినా, ఆడకపోయినా వాళ్లకు పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. టిమ్ సౌథీ లేకుండా ఎలా గెలవాలో వాళ్లకు తెలుసు..
New Zealand vs Afghanistan
మధ్య ఓవర్లలో వెంటవెంటనే మూడు వికెట్లు పడ్డాయి. న్యూజిలాండ్ స్వల్ప స్కోరుకే అవుట్ అవుతుందని అనుకున్నా. అప్పుడు టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్ కలిసి ఆదుకున్నారు. విల్ యంగ్, రచిన్ రవీంద్ర చక్కగా ఆడుతున్నారు..
డివాన్ కాన్వే సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్, మ్యాట్ హెన్రీ, లూకీ ఫర్గూసన్ నిప్పులు చెదిరే బౌలింగ్ వేస్తున్నారు.
New Zealand
మిచెల్ సాంట్నర్ గురించి చెప్పాల్సిన పనే లేదు. న్యూజిలాండ్- ఇండియా మ్యాచ్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందని అనుకుంటున్నా..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా..