- Home
- Sports
- Cricket
- Asia Cup 2023: మీరు తోక జాడిస్తే ఎలా..? రిటర్న్ గ్యారెంటీ కావాలి.. పాక్‌తో ఐసీసీ చర్చలు
Asia Cup 2023: మీరు తోక జాడిస్తే ఎలా..? రిటర్న్ గ్యారెంటీ కావాలి.. పాక్‌తో ఐసీసీ చర్చలు
Asia Cup 2023: ఆసియా కప్ వివాదం నానాటికీ తీవ్రమవుతోంది. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా ఇందులో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

ఈ ఏడాది ఆసియా కప్ నిర్వహణ వివాదం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఈ అంశంలో పట్టు వీడకపోవడంతో పాటు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తుండటంతో ఈ సమస్య రాను రాను జటిలమవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా రంగంలోకి దిగింది.
ఆసియా కప్ -2023 ని హైబ్రిడ్ మోడల్ (భారత్ మ్యాచ్ లు బయట, మిగతావి పాక్ లో) లో నిర్వహిస్తామని పీసీబీ చీఫ్ నజమ్ సేథీ ప్రతిపాదనకు అంగీకరించకుంటే తాము ఈ టోర్నీని బహిష్కస్తామని పీసీబీ ఇదివరకే హెచ్చరించింది. కొన్నిరోజులుగా ఆసియా కప్ ను శ్రీలంకలో నిర్వహిస్తారన్న వాదనలు వస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్.. ఈ టోర్నీతో పాటు అక్టోబర్ లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్ నుంచి కూడా తప్పుకుంటామని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఐసీసీ ఈ ఇష్యూను సాల్వ్ చేసేందుకు సిద్ధమైంది.
Image credit: Wikimedia Commons
ఇదే విషయమై ఐసీసీ చైర్మెన్ గ్రెగ్ బార్క్లే, సీఈవో జెఫ్ అలార్డైస్ లు లాహోర్ (పాకిస్తాన్) కు చేరకున్నారు. ఈ ఇద్దరూ పీసీబీ చీఫ్ తో పాటు ఇతర అధికారులతో సమావేశం కానున్నారు. ఒకవేళ ఆసియా కప్ ను పాకిస్తాన్ చెప్పినట్టుగానే హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తే భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఆడుతుందా..? అన్నది రాతపూర్వకంగా రాసిస్తేనే తాము బీసీసీఐతో పాటు ఇతర దేశాలతో మాట్లాడేందుకు సిద్ధమైనట్టు ఐసీసీ ప్రతినిధులు పీసీబీతో తేల్చి చెప్పినట్టు తెలుస్తున్నది.
ఆసియా కప్ లో హైబ్రిడ్ మోడల్ ను అంగీకరిస్తే పాకిస్తాన్.. వన్డే వరల్డ్ కప్ లో కూడా తాను ఆడబోయే మ్యాచ్ లు కూడా భారత్ లో కాకుండా బంగ్లాదేశ్ లో గానీ మరో తటస్థ వేదికపై నిర్వహించాలని పట్టుబట్టే అవకాశం ఉంది. ఇది ఐసీసీ తో పాటు బీసీసీఐకి కూడా తలనొప్పి వ్యవహారమే.
ఈ నేపథ్యంలో ఐసీసీ.. పీసీబీ నుంచి రాతపూర్వక హామీ కోరనుంది. దీని ప్రకారం.. ఒకవేళ బీసీసీఐ పీసీబీ హైబ్రిడ్ మోడల్ కు అంగీకారం చెబితే అప్పుడు పాకిస్తాన్ జట్టు వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు భారత్ కు రావాల్సి ఉంటుంది. మరి పీసీబీ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.