నాలుగు మ్యాచుల్లో ఒక్కటి ఓడినా ఇంటికే! దాదాపు ఒకే పొజిషన్‌లో 2022 టీ20 వరల్డ్ కప్ ఫైనలిస్టులు...
ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని టైటిల్ ఫెవరెట్లుగా ఆరంభించాయి టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనలిస్టులు ఇంగ్లాండ్, పాకిస్తాన్. మొదటి రెండు మ్యాచుల్లో నెదర్లాండ్స్, శ్రీలంకలపై ఘన విజయాలు అందుకున్న పాక్, ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ మ్యాచుల్లో ఓడింది. ఇంగ్లాండ్‌ది కూడా దాదాపు సేమ్ ఇదే కథ...
బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్ వంటి వరల్డ్ టాప్ క్లాస్ బ్యాటర్లు, హారీస్ రౌఫ్, షాహీన్ ఆఫ్రిదీ, హసన్ ఆలీ వంటి వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లు ఉన్న పాకిస్తాన్... టీమిండియాతో మ్యాచ్‌లో ఓటమి నుంచి కోలుకోవడానికి కష్టపడుతున్నట్టు కనిపిస్తోంది..
ఇండియాతో మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియాపై ఓడిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో అయితే చిత్తుగా ఓడింది. ఆఫ్ఘాన్‌పై 282 పరుగుల స్కోరు చేసిన పాకిస్తాన్, చెన్నైలో స్పిన్ పిచ్ మీద ఆ టార్గెట్‌ని కాపాడుకోలేకపోయింది..
కనీసం 6-7 వికెట్లు తీసినా పాకిస్తాన్ పరువు కాస్తో కూస్తో నిలిచేది. వచ్చిన బ్యాటర్ వచ్చినట్టుగా హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పి, పాకిస్తాన్ టాప్ క్లాస్ బౌలింగ్ యూనిట్‌ని చీల్చి చెండాడేశారు..
హైదరాబాద్‌లో రెండు మ్యాచులు గెలిచిన పాకిస్తాన్, చెన్నైలో అక్టోబర్ 27న సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడనుంది. సౌతాఫ్రికా ఎప్పుడు ఎలా ఆడుతుందో చెప్పలేం. ఆ తర్వాత అక్టోబర్ 31న బంగ్లాదేశ్‌తో కోల్‌కత్తాలో మ్యాచ్ ఆడే పాకిస్తాన్, నవంబర్ 4న న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడనుంది..
England vs Pakistan
ఆ తర్వాత నవంబర్ 11న ఇంగ్లాండ్‌తో కోల్‌కత్తాలో మ్యాచ్ ఆడనుంది. మొదటి ఐదు మ్యాచుల్లో రెండే విజయాలు అందుకున పాకిస్తాన్, సెమీస్ రేసులో నిలవాలంటే ఈ నాలుగు మ్యాచులు తప్పక గెలిచి తీరాల్సిందే..
మొదటి నాలుగు మ్యాచుల్లో మూడింట్లో ఓడిన ఇంగ్లాండ్ పరిస్థితి కూడా దాదాపు ఇదే. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, మిగిలిన మ్యాచుల్లో శ్రీలంక, ఇండియా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్‌లతో తలబడుతోంది.
సెమీస్ రేసులో నిలవాలంటే ఇంగ్లాండ్ ఈ మ్యాచులన్నీ గెలిచి తీరాల్సిందే. టైటిల్ ఫెవరెట్‌లో వన్డే వరల్డ్ కప్ టోర్నీని మొదలెట్టిన ఇంగ్లాండ్, పాకిస్తాన్... 22 మ్యాచులు ముగిసే సమయానికి ఒక్క మ్యాచ్ ఓడినా సెమీస్ రేసు నుంచి తప్పుకునే ‘డూ ఆర్ డై’ పరిస్థితుల్లో పడ్డాయి..