MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఐసీసీ నెం.1 టెస్టు బ్యాటర్‌గా కేన్ విలియంసన్... వాళ్ల ఫెయిల్యూర్‌తో లక్కీగా టాప్ ప్లేస్‌కి...

ఐసీసీ నెం.1 టెస్టు బ్యాటర్‌గా కేన్ విలియంసన్... వాళ్ల ఫెయిల్యూర్‌తో లక్కీగా టాప్ ప్లేస్‌కి...

కొన్నిసార్లు ఏం చేయకుండా కూడా చూడండి.. అని ఓ చాక్లెట్‌ యాడ్‌లో చెప్పినట్టుగా, గత నాలుగు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్న కేన్ విలియంసన్.. ఏమీ చేయకుండానే లక్కీగా ఐసీసీ నెం.1 టెస్టు బ్యాటర్‌గా అవతరించాడు..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 06 2023, 02:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Joe Root

Joe Root

గత వారం టాప్ ప్లేస్‌లో ఉన్న జో రూట్, లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 10, రెండో ఇన్నింగ్స్‌లో 18 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఏకంగా నాలుగు స్థానాలు దిగజారిన జో రూట్, టాప్ 5లో స్థిరపడ్డాడు..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Kane Williamson

Kane Williamson

దాదాపు నాలుగేళ్ల తర్వాత టాప్ 5 నుంచి కిందకి పడిపోయిన స్టీవ్ స్మిత్, రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌‌లో 110, రెండో ఇన్నింగ్స్‌లో 34 పరుగులు చేసి ... మళ్లీ టాప్ 2లోకి దూసుకొచ్చాడు. మూడో టెస్టులో స్మిత్ బ్యాటు నుంచి సరైన పర్ఫామెన్స్ వస్తే... టాప్ ప్లేస్‌కి ఎగబాకుతాడు..
 

36
Steve Smith

Steve Smith

ఐపీఎల్ 2023 సీజన్‌లో గాయపడిన కేన్ విలియంసన్, ప్రస్తుతం టీమ్‌కి దూరంగా ఉన్నాడు. మిగిలిన బ్యాటర్లు ఫెయిల్ కావడంతో టాప్ ప్లేస్‌కి వెళ్లిన కేన్ విలియంసన్ ఖాతాలో ప్రస్తుతం 883 పాయింట్లు ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న స్టీవ్ స్మిత్ 882 పాయింట్లు సాధించాయి. ఈ ఇద్దరికీ ఉన్న తేడా కేవలం 1 పాయింట్ మాత్రమే.

46

యాషెస్ సిరీస్‌కి ముందు టాప్ ప్లేస్‌లో ఉన్న ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 873 పాయింట్లతో మూడో స్థానంలో ఉంటే, ట్రావిస్ హెడ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. జో రూట్ ఐదో స్థానంలో ఉంటే బాబర్ ఆజమ్ ఆరో స్థానానికి పడిపోయాడు..

56

టీమిండియా బ్యాటర్ రిషబ్ పంత్ ఒక్కడే టాప్ 10లో కొనసాగుతున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్, టెస్టు నెం.1 బౌలర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకోగా ప్యాట్ కమ్మిన్స్ రెండో స్థానానికి దూసుకొచ్చాడు. టాప్ 8లో జస్ప్రిత్ బుమ్రా, టాప్ 9లో రవీంద్ర జడేజా ఉన్నారు..

66
Image credit: Getty

Image credit: Getty

టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా టాప్‌లో ఉంటే, రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. షకీబ్ అల్ హసన్ టాప్ 3లో ఉంటే, బెన్ స్టోక్స్ టాప్ 4కి వచ్చాడు. అక్షర్ పటేల్ టాప్ 5లో ఉన్నాడు...
 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Kohli Mental Health : ఇంపోస్టర్ సిండ్రోమ్ తో బాధపడుతున్న విరాట్ కోహ్లీ .. లక్షణాలేంటో తెలుసా..?
Recommended image2
Vaibhav Sooryavanshi: ఐపీఎల్‌లో వైభవ్ విధ్వంసం.. ఆ A సెలబ్రేషన్ సీక్రెట్ ఇదే బ్రో !
Recommended image3
Vaibhav Sooryavanshi : ఐపీఎల్‌లో హిస్టరీ క్రియేట్ చేసిన 15 ఏళ్ల కుర్రాడు.. గేల్ రికార్డ్ ఇక అవుట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved