MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన యశస్వి జైస్వాల్.. కోహ్లీని అధిగమించే ఛాన్స్ !

రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన యశస్వి జైస్వాల్.. కోహ్లీని అధిగమించే ఛాన్స్ !

ICC Rankings - Yashasvi Jaiswal: భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో టీమిండియా యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ త‌న బ్యాట్ తో దుమ్మురేపుతున్నాడు. ప‌రుగుల వ‌ర‌ద పారిస్తూ ఈ సిరీస్ లో ఇప్ప‌టివ‌ర‌కు అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయర్ గా ఉన్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ లోనూ దూసుకుపోతున్నాడు.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 29 2024, 09:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Rohit Sharma Yashasvi Jaiswal

Rohit Sharma-Yashasvi Jaiswal

ICC Rankings - Yashasvi Jaiswal: భారత్-ఇంగ్లాండ్ మ‌ధ్య జ‌రుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో ఇప్ప‌టికే 4 మ్యాచ్ లు పూర్తికాగా, 5వ టెస్టు మార్చి 7 నుంచి ధ‌ర్మ‌శాల‌లో జ‌ర‌గ‌నుంది. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు ఈ సిరీస్ లో భార‌త యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ 600కు పైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అతను వరుసగా 80, 15, 209, 17, 10, 214, 73, 37 చొప్పున మొత్తం 655 పరుగులు చేశాడు. చివరి 4వ టెస్టు మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.

36
Yashasvi Jaiswal

Yashasvi Jaiswal

ఈ సిరీస్ లో చివ‌రి మ్యాచ్ లో మార్చి 7 నుంచి  ధర్మశాలలో జరగనుంది. తాజాగా ఐసీసీ ప్ర‌క‌టించిన టెస్టు ర్యాకింగ్స్ లో య‌శ‌స్వి జైస్వాల్ స‌త్తా చాటాడు. ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్‌ల ర్యాంకింగ్స్ లో జైస్వాల్ 3 స్థానాలు మెరుగుపడి 12వ ర్యాంక్‌లో నిలిచాడు. రోహిత్ శర్మ 12వ స్థానం నుంచి 13వ స్థానానికి పడిపోయాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ను జైస్వాల్ అధిగ‌మించాడు. 

46
yashasvi jaiswal.jp

yashasvi jaiswal.jp

టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ 744 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నాడు. జైస్వాల్ 727 పాయింట్లతో 12వ ర్యాంక్‌లో ఉన్నాడు. చివరి మ్యాచ్ లో జైస్వాల్ సెంచరీ సాధిస్తే విరాట్ కోహ్లీని అధిగమించే అవకాశముంది. రోహిత్ శర్మ కూడా 720 పాయింట్లతో 13వ స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ నెం.1 స్థానంలో ఉన్నాడు. 

56
yashasvi jaiswal 7

yashasvi jaiswal 7

టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భార‌త స్టార్ జ‌స్ప్రీత్ బుమ్రా నంబర్‌వన్‌గా ఉన్నాడు. అతను 867 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, రవిచంద్రన్ అశ్విన్ 846 పాయింట్లతో 2వ స్థానంలో ఉన్నారు. రవీంద్ర జడేజా 785 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతున్నాడు.

 

66
yashasvi jaiswal 8.jp

yashasvi jaiswal 8.jp

టెస్టు ఆల్ రౌండర్ల జాబితాలో టాప్ 5లో భారత ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో రవీంద్ర జడేజా 449 పాయింట్లతో నంబర్ 1, రవిచంద్రన్ అశ్విన్ 323 పాయింట్లతో 2వ స్థానంలో ఉన్నారు. అక్షర్ పటేల్ కూడా 275 పాయింట్లతో 5వ స్థానంలో ఉన్నాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్ !
Recommended image2
Ben Stokes: సడన్ షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ సడన్ రిటైర్మెంట్ ఎందుకిచ్చాడు?
Recommended image3
IND vs IRE: అబ్బా ఏం మ్యాచ్ రా బాబు.. లాస్ట్ బాల్‌కి సిక్స్ కొట్టినా ఓడిపోయిన ఇండియా.. అసలు కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved