శుబ్‌మన్ గిల్‌కి లక్కీ ఛాన్స్! ఆస్ట్రేలియా సిరీస్‌లో ఒక్క సెంచరీ చేస్తే... బాబర్ ఆజమ్‌ని వెనక్కినెట్టేసి...
యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్, అతి తక్కువ కాలంలోనే భారత జట్టుకి త్రీ ఫార్మాట్ ప్లేయర్‌గా మారిపోయాడు. 2019 జనవరిలో వన్డే ఆరంగ్రేటం చేసిన శుబ్‌మన్ గిల్, 2021 నుంచి వరుసగా మ్యాచులు ఆడుతున్నాడు. 33 వన్డేలు ఆడిన శుబ్‌మన్ గిల్, నెం.1 వన్డే బ్యాటర్‌గా నిలిచేందుకు ఒక్క సెంచరీ దూరంలో నిలిచాడు..
Babar Azam
కొన్ని నెలలుగా వన్డేల్లో నెం.1 బ్యాటర్ ప్లేస్‌లో కూర్చున్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ఆసియా కప్ 2023 టోర్నీలో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. పసికూన నేపాల్‌తో మ్యాచ్‌లో 151 పరుగులు చేసిన బాబర్ ఆజమ్, ఆ తర్వాత టీమిండియా, శ్రీలంక, బంగ్లాదేశ్‌తో మ్యాచుల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు..
Shubman Gill
మరోవైపు శుబ్‌మన్ గిల్, నిలకడైన ప్రదర్శన చూపిస్తూ... ఆసియా కప్ 2023 టోర్నీలో 6 మ్యాచుల్లో 302 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 121 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు శుబ్‌మన్ గిల్..
Shubman Gill Century
ఈ పర్ఫామెన్స్ కారణంగా వన్డే ర్యాంకింగ్స్‌లో శుబ్‌మన్ గిల్ 814 పాయింట్లు సాధించి, టీమిండియా తరుపున కెరీర్ బెస్ట్ రేటింగ్స్ సాధించిన ఆరో బ్యాటర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ వన్డేల్లో 911 రేటింగ్ పాయింట్స్‌తో టాప్‌లో ఉంటే, సచిన్ టెండూల్కర్ 887, రోహిత్ శర్మ 885, సౌరవ్ గంగూలీ 844, ధోనీ 836 పాయింట్లతో గిల్ కంటే ముందున్నారు..
టాప్‌లో ఉన్న బాబర్ ఆజమ్ (857 పాయింట్లు)కి, శుబ్‌మన్ గిల్‌కి మధ్య తేడా 43 రేటింగ్ పాయింట్స్ మాత్రమే. సెప్టెంబర్ 22న ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో తొలి వన్డేలో శుబ్‌మన్ గిల్ సెంచరీ చేస్తే... బాబర్ ఆజమ్‌ని వెనక్కినెట్టి, నెం.1 వన్డే బ్యాటర్‌గా నిలుస్తాడు.
ఆస్ట్రేలియాతో మొదటి రెండు వన్డేల నుంచి రెస్ట్ తీసుకున్న టీమిండియా సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ 8వ స్థానంలో, రోహిత్ శర్మ 10వ స్థానంలో ఉన్నారు...
ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ మళ్లీ టాప్ ర్యాంకులోకి ఎగబాకింది. ఆసియా కప్‌లో సూపర్ 4 రౌండ్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడినా, ఆస్ట్రేలియా ఫెయిల్యూర్ పాకిస్తాన్‌కి కలిసి వచ్చింది. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తొలి 2 వన్డేలు గెలిచిన ఆసీస్, వరుసగా 3 మ్యాచుల్లో ఓడి మూడో స్థానానికి పడిపోయింది..
Mohammed Siraj
ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌ని టీమిండియా 3-0, 2-1, 2-0 తేడాతో సొంతం చేసుకుంటే, ఐసీసీ నెం.1 వన్డే టీమ్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం 115 పాయింట్లతో పాకిస్తాన్‌తో సమానంగా ఉంది భారత జట్టు. అయితే రేటింగ్ పాయింట్స్ కారణంగా పాక్ టాప్‌లో నిలిచింది..
Siraj
ఆసియా కప్ ఫైనల్‌లో 6 వికెట్లు తీసి అదరగొట్టిన మహ్మద్ సిరాజ్, రెండు నెలల గ్యాప్ తర్వాత మళ్లీ ఐసీసీ నెం.1 వన్డే బౌలర్‌గా నిలిచాడు..