- Home
- Sports
- Cricket
- ICC Cricket World Cup 2023 : పడిపోతున్న గిల్ ప్లేట్ లెట్స్.. హుటాహుటిన హాస్పిటల్ కు తరలింపు
ICC Cricket World Cup 2023 : పడిపోతున్న గిల్ ప్లేట్ లెట్స్.. హుటాహుటిన హాస్పిటల్ కు తరలింపు
డెంగ్యూ బారినపడ్డ టీమిండియా యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ కు దూరమయ్యాడు. అతడు ఇంకా కోలుకోకపోవడంతో తర్వాతి మ్యాచ్ కూడా అడటం అనుమానంగానే కనిపిస్తోంది.

Shubman Gill
చెన్నై : స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ 2023 లో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. ఇప్పటికే ఆస్ట్రేలియాపై విజయంతో టైటిల్ వేట ప్రారంభించిన భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది.మంచి ఫామ్ లో వున్న ట్యాలెంటెడ్ యంగ్ ప్లేయర్ శుభ్ మన్ గిల్ డెంగ్యూ బారినపడ్డ విషయం తెలిసిందే. ఇలా జ్వరంతో బాధపడుతున్న గిల్ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ కు దూరమైన రేపు(బుధవారం) అప్ఘానిస్తాన్ తో జరిగే మ్యాచ్ కు అందుబాటులోకి వస్తాడని అందరూ భావించారు. కానీ అతడు ఇంకా డెంగ్యూ నుండి కోలుకోకపోవడంతో రెండో మ్యాచ్ కు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
Shubman Gill
డెంగ్యూతో బాధపడుతున్న గిల్ ప్లేట్ లెట్స్ పడిపోతుండటంతో చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో చేరినట్లు తెలుస్తోంది. ఇలాగే ప్లేట్ లెట్స్ తగ్గిపోతుంటే గిల్ కోలుకోడానికి సమయం పడుతుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అంటే బుధవారం అప్ఘాన్ తో జరిగే మ్యాచ్ లో కూడా గిల్ ఆడే అవకాశాలు కనిపించడం లేదు.
Shubman Gill
ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లంతా చెన్నై నుండి డిల్లీకి చేరుకున్నారు. కానీ తీవ్ర జ్వరంతో బాధపడుతున్న గిల్ చికిత్స కోసం చెన్నైలోనే వుండిపోయారు. ప్లేట్ లెట్లు పెరిగి... జ్వరం నుండి పూర్తిగా కోలుకున్న తర్వాతే గిల్ భారత శిబిరంలో చేరనున్నారు. అక్టోబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ నాటికి గిల్ కోలుకునే అవకాశాలున్నాయి. టీమిండియా ఫ్యాన్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు.
Shubman Gill
ప్రస్తుతం గిల్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. అతడి ప్లేట్ లెట్స్ మరింతలా పడిపోకుండా వైద్యులు జాగ్రత్త పడుతున్నారు. అహ్మదాబాద్ వేదికన పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ కు ఇంకా మూడురోజుల సమయం వుంది. అప్పటివరకు ఆయన పూర్తిగా కోలుకునే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నట్లు సమాచారం.
Shubman Gill
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ బలహీనంగా వున్నట్లు స్పష్టమయ్యింది. కేవలం ఒకరిద్దరిపైనే ఆధారపడుతోందని... వాళ్లు విఫలమైతే గెలుపుపై ఆశలు వదులకునే పరిస్థితి వుంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ క్రీజులో నిలబడకుంటే టీమిండియా పరిస్థితి చాలా దారుణంగా వుండేది. అందువల్లే గిల్ లాంటి ఆటగాడు ఇప్పుడు భారత జట్టుకు చాలా అవసరం. అతడు జట్టులో చేరితే బ్యాటింగ్ విభాగం మరింత బలపడుతుంది... అప్పుడు అన్ని విభాగాల్లో టీమిండియా స్ట్రాంగ్ గా వుంటుంది.
Shubman Gill
భారత క్రికెట్ ఫ్యాన్స్ శుభ్ మన్ గిల్ త్వరగా కోలుకుని బరిలోకి దిగాలని కోరుకుంటున్నారు. పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ నాటికి గిల్ కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నారు.