ఇవి ఐసీసీ అవార్డులు కావు, ఐపీఎల్ అవార్డ్స్... పాక్ క్రికెట్ ఫ్యాన్స్ అసహనం...
ఐసీసీ ఆదివారం డిసెంబర్ 27న ప్రకటించిన టీమ్ డికేడ్ అవార్డుల్లో ఒక్క పాక్ ప్లేయర్‌కి కూడా చోటు దక్కలేదు. ఆఫ్ఘాన్ నుంచి సంచలన ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్‌కి చోటు ఇచ్చిన ఐసీసీ, పాక్ ప్లేయర్లలో ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదు. దీంతో పాక్ క్రికెట్ అభిమానులు, ఐసీసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఐసీసీ అవార్డులు కావు, ఐపీఎల్ అవార్డులంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఈ దశాబ్ద కాలంలో పాక్ జట్టు సంచలన విజయాలు నమోదు చేసిందని లెక్కలతో సహా చెబుతోందని పాక్ ఫ్యాన్స్, తమ క్రికెటర్లకు ఎందుకు చోటు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
గత దశాబ్ద కాలంలో టీ20ల్లో ఏబీ డివిల్లియర్స్ కంటే మెరుగ్గా రాణించిన బాబర్ ఆజమ్ ఎందుకు మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది డికేట్‌లో చోటు దక్కించుకోలేకపోయాడంటూ ప్రశ్నిస్తున్నారు...
‘ఇవి ఐసీసీ అవార్డులు కాదు, ఐపీఎల్ అవార్డులు అని రాయడం మరిచిపోయారంటూ’ ఐసీసీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు...
పాక్ ఫ్యాన్స్, భారత క్రికెటర్లపై అక్కసు చూపిస్తుండడంతో తట్టుకోలేకపోయిన కొందరు టీమిండియా ఫ్యాన్స్, వారికి రికార్డుల లెక్కలతో సమాధానం ఇస్తున్నారు...
లియోనెల్ మెస్సీ కంటే భారత కెప్టెన్ సునీల్ ఛెత్రీ ఎక్కువ గోల్స్ చేశాడని, అయితే ఏ జట్టుపై అతను గోల్స్ చేశాడనేది కూడా లెక్కలోకి వస్తుందని... బంగ్లా, జింబాబ్వే, ఆఫ్ఘాన్‌పై ఆడినంత మాత్రాన స్టార్ పర్ఫామర్లు కారని పాక్ ఫ్యాన్స్ ఆరోపణలను తిప్పి కొడుతున్నారు భారత క్రికెట్ అభిమానులు.
ఐసీసీ టీమ్ అవార్డుల్లో పాక్ క్రికెటర్ల పేర్లు లేకపోవడంపై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా అసహనం వ్యక్తం చేశాడు...
‘ఇలా జరుగుతుందని ముందుగానూ అంచనా వేశానని...’ ఐపీఎల్ అవార్డులంటూ ఓ పాక్ అభిమాని పెట్టిన ట్వీట్‌ను రీట్వీట్ చేశాడు షోయబ్ అక్తర్.
టీ20ల్లో పాక్ టీమ్‌ను ఐసీసీ టాప్ టీమ్‌గా చేసిన ముగ్గురు పాక్ బౌలర్లలో ఒక్కరికి కూడా టీ20 జట్టులో చోటు దక్కకపోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఆ దేశ ఫ్యాన్స్. కనీసం మహ్మద్ అమీర్‌కైనా ప్లేస్ ఇవ్వాల్సిందని డిమాండ్ చేస్తున్నారు.
వన్డే, టెస్టు జట్టలో పాక్ ప్లేయర్లకు చోటు దక్కకపోవడంపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయని పాక్ అభిమానులు, టీ20 జట్టు విషయంలో మాత్రం తెగ హడావుడి చేస్తున్నారు.
జింబాబ్వే, ఆఫ్ఘాన్‌లపై ఆడాడనే ఉద్దేశంలో బాబర్ ఆజమ్‌కి జట్టులో చోటు ఇవ్వని ఐసీసీ... ఆఫ్ఘాన్ యువ సంచలనం రషీద్ ఖాన్‌ని ఎందుకు సెలక్ట్ చేసిందని ప్రశ్నిస్తున్నారు పాక్ ఫ్యాన్స్. అయితే ఈ డిమాండ్‌తో పాక్ క్రికెటర్ల పరువును ఆ దేశ అభిమానులే తీస్తున్నారని అంటున్నారు మరికొందరు.
ఐసీసీ టీమ్ అవార్డుల్లో టెస్టు టీమ్‌కి విరాట్ కోహ్లీ, వన్డే, టీ20 జట్లకి మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్లుగా ఎంపికైన సంగతి తెలిసిందే.
ఐసీసీ ప్రకటించిన బెస్ట్ ఎలెవన్ వన్డే, టీ20, టెస్టు జట్లలో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ‘కింగ్’ విరాట్ కోహ్లీ...
విరాట్ కోహ్లీతో పాటు టెస్టు టీమ్‌లో రవిచంద్రన్ అశ్విన్, వన్డే జట్టులో రోహిత్ శర్మ, ఎమ్మెస్ ధోనీ, టీ20 టీమ్‌లో ధోనీ, రోహిత్, బుమ్రా కూడా చోటు దక్కించుకున్నారు.