- Home
- Sports
- Cricket
- వన్డే వరల్డ్ కప్ వార్మప్ మ్యాచుల్లోనూ హైదరాబాద్‌కి అన్యాయం... గౌహతి, తిరువనంతపురంలో...
వన్డే వరల్డ్ కప్ వార్మప్ మ్యాచుల్లోనూ హైదరాబాద్‌కి అన్యాయం... గౌహతి, తిరువనంతపురంలో...
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి భారత్ వేదిక ఇవ్వనుంది. దేశంలోని 12 నగరాల్లో ప్రపంచ కప్ మ్యాచులు జరగబోతున్నాయి. తాజాగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి సంబంధించిన వార్మప్ మ్యాచుల షెడ్యూల్‌ని ఖరారు చేసింది ఐసీసీ. అక్టోబర్ 5న వన్డే ప్రపంచకప్ ఆరంభానికి, వారం రోజుల ముందే వార్మప్ మ్యాచులు జరగబోతున్నాయి...

సెప్టెంబర్ 29న గౌహతీలో బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మధ్య వార్మప్ మ్యాచ్ జరుగుతుంది. అదే తిరువనంతపురంలో సౌతాఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్, హైదరాబాద్‌లో న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతాయి.
సెప్టెంబర్ 30న గౌహతిలో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా, తిరువనంతపురంలో ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ ప్రాక్టీస్ మ్యాచులు జరుగుతాయి. అక్టోబర్ 1న ఎలాంటి వార్మప్ మ్యాచులు జరగవు.
ICC Cricket World Cup 2023
అక్టోబర్ 2న గౌహతిలో ఇంగ్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్, తిరువనంతపురంలో న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచులు జరుగుతాయి.. అక్టోబర్ 3న గౌహతిలో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక, తిరువనంతపురంలో ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్, హైదరాబాద్‌లో పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వార్మప్ మ్యాచులు జరుగుతాయి..
మొత్తంగా ప్రాక్టీస్ మ్యాచులకు గౌహతి, తిరువనంతపురం, హైదరాబాద్ నగరాలు వేదిక ఇవ్వబోతుంటే... హైదరాబాద్ మినహా మిగిలిన రెండు నగరాల్లో టీమిండియా మ్యాచులు ఆడబోతుండడం విశేషం..
హైదరాబాద్‌లో రెండు వరల్డ్ కప్ మ్యాచులు ఆడబోతున్న పాకిస్తాన్, ఇదే మైదానంలో రెండు వార్మప్ మ్యాచులు ఆడబోతుండడం ఆ టీమ్‌కి కలిసి వచ్చే విషయం. మిగిలిన గౌహతి, తిరువనంతపురం వేదికల్లో కేవలం వార్మప్ మ్యాచులే జరుగుతాయి, వరల్డ్ కప్ మ్యాచులు జరగడం లేదు.
వరల్డ్ కప్ వార్మప్ మ్యాచులు చూసేందుకు కూడా టికెట్లు కొనుక్కోవాల్సిందే. బుక్ మై షో యాప్‌లో ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయి. నేరుగా టికెట్లు కొనుక్కోవాలని అనుకునేవారి కోసం, కొన్ని ఎంపిక చేసిన ఏరియాల్లో వార్మప్ మ్యాచులకు, వరల్డ్ కప్ మ్యాచులకు సంబంధించిన టికెట్ల విక్రయాలు జరుగుతాయి.