వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ... ఈసారి ఐపీఎల్ కంటే ఎక్కువే...
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ప్రైజ్ మనీని ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా వన్డే క్రికెట్ టోర్నీలో మొత్తంగా 10 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ (దాదాపు 83 కోట్ల రూపాయలు) చెల్లించనుంది ఐసీసీ...
ICC World Cup 2011
గ్రూప్ స్టేజీలో 10 జట్లు పోటీపడతాయి. ఇందులో నుంచి టాప్‌లో నిలిచిన నాలుగు జట్లు మాత్రమే సెమీ ఫైనల్‌కి అర్హత సాధిస్తాయి. గ్రూప్ స్టేజీ ఒక్కో మ్యాచ్ గెలిచినందుకు 40 వేల డాలర్లు (దాదాపు 33 లక్షల రూపాయలకు పైగా) దక్కనుంది..
గ్రూప్ స్టేజీ నుంచి నిష్కమించే ఆరు జట్లకు తలా 1 లక్ష డాలర్లు (దాదాపు 83 లక్షల రూపాయలు) ప్రైజ్ మనీగా దక్కుతుంది.
సెమీస్‌లో గెలిచే రెండు జట్లు ఫైనల్ చేరితే, ఓడిన జట్లు ఇంటి దారి పడతాయి. సెమీ ఫైనల్‌లో ఓడి, ఇంటికి వచ్చే రెండు జట్లకు చెరో 8 లక్షల డాలర్లు (దాదాపు 6 కోట్ల 63 లక్షలకు పైగా) దక్కుతుంది..
ఫైనల్‌లో ఓడి, రన్నరప్‌గా నిలిచిన జట్టుకి 20 లక్షల డాలర్లు (దాదాపు 16.5 కోట్ల రూపాయలు) ప్రైజ్ మనీ రూపంలో దక్కితే, వన్డే వరల్డ్ కప్ 2023 టైటిల్‌లో గెలిచిన టీమ్‌కి ట్రోఫీతో పాటు 40 లక్షల డాలర్లు (దాదాపు 33 కోట్ల రూపాయలు) ప్రైజ్‌మనీ రూపంలో అందుతుంది.
ఐపీఎల్ 2023 సీజన్‌లో విన్నింగ్ టీమ్‌కి రూ.20 కోట్లు ప్రైజ్ మనీ రూపంలో దక్కితే, రన్నరప్ టీమ్‌కి రూ.13 కోట్లు ప్రైజ్ మనీ దక్కింది. ఐపీఎల్ 2023 సీజన్‌తో పోలిస్తే, వన్డే వరల్డ్ కప్ 2023 ప్రైజ్ మనీ, 60 శాతానికి పైగా ఎక్కువగా ఉంది.